ఇటీవలే పాకిస్థాన్ లాహోర్‌కు చెందిన ఎనిమిదేళ్ల సామియా అఫ్సర్.. క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఈ క్రమంలోనే అనేక మంది క్రికెటర్లు ఈ చిన్నారి క్రికెటర్‌పై ప్రశంసలు కురిపించారు. తాజాగా, సామియాకు ఎంతో ఇష్టమైన పాక్ బ్యాట్స్‌మన్ బాబర్ అజామ్.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించాడు. ఈ క్రమంలోనే సామియా ఆటతీరును ప్రశంసించాడు బాబర్. ఆమె బ్యాటింగ్ టైమింగ్ అద్భుతమని అన్నాడు. ఇంకా మంచి బ్యాట్స్‌మన్‌గా ఎలా రాణించాలో కొన్ని చిట్కాలనూ పంచుకున్నాడు బాబర్.
ఈ సంభాషణ అనంతరం బాబర్ మాట్లాడుతూ.. "ఆటలో ఆభిమానులు అంతర్భాగమైపోతారు. వారే మమ్మల్ని గెలుపు దిశగా ప్రేరేపిస్తారు. ఇటువంటి వారు మా విజయం కోసం ప్రార్థిస్తూ.. మా వెనకే ఉన్నారని తెలిసినప్పుడు మరింత ఉత్సాహంతో మ్యాచ్‌ను అడతాం." అని బాబర్ పేర్కొన్నాడు.
-
📽️ @babarazam258 e-meets eight-year-old fan
— Pakistan Cricket (@TheRealPCB) July 15, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
More: https://t.co/Uiqf9P1oJo pic.twitter.com/cliRl6fvhm
">📽️ @babarazam258 e-meets eight-year-old fan
— Pakistan Cricket (@TheRealPCB) July 15, 2020
More: https://t.co/Uiqf9P1oJo pic.twitter.com/cliRl6fvhm📽️ @babarazam258 e-meets eight-year-old fan
— Pakistan Cricket (@TheRealPCB) July 15, 2020
More: https://t.co/Uiqf9P1oJo pic.twitter.com/cliRl6fvhm
కరోనా పరిస్థితులు మెరుగుపడిన అనంతరం.. సామియాను తప్పకుండా కలుస్తానని బాబర్ అన్నాడు. సామియా ప్రాక్టీస్ వీడియోకు శ్రీలంక క్రికెటర్ కుమార సంగక్కర కూడా ముగ్దుడయ్యాడు. తన కంటే మంచి టెక్నిక్‌తో ఆడుతున్నట్లు తెలిపాడు. ఇటువంటి వారి ప్రతిభను ప్రోత్సాహించాలని సూచించాడు.
ఇంగ్లాండ్‌కు- పాకిస్థాన్ మధ్య జరగనున్న మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా.. ప్రస్తుతం అజామ్ ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్నాడు. తొలి టెస్టు ఆగస్టు 5న ప్రారంభం కానుంది.
ఇదీ చూడండి:'దిల్ బెచారా' నుంచి మరో ప్రేమగీతం