పాకిస్థాన్ ప్రముఖ క్రికెటర్ బాబర్ అజమ్‌ను 'మిలియన్ డాలర్ ప్లేయర్' అని భారత స్పిన్నర్ అశ్విన్ ప్రశంసించాడు. అతడు బ్యాటింగ్ చేస్తుంటే చూసేందుకు చాలా బాగుంటుందని అన్నాడు. పాక్ మాజీ ఆటగాడు ఇంజిమామ్ ఉల్ హక్‌తో జరిగిన యూట్యూబ్ ఇంటర్వ్యూ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశాడు.
ఇటీవలే జరిగిన పాక్ ప్రీమియర్ లీగ్‌లోనూ బాబర్ అదరగొట్టాడు. కరాచీ కింగ్స్‌కు కెప్టెన్సీ వహించిన ఇతడు.. ఈ జట్టు తొలిసారి టైటిల్ గెలవడంలో ప్రముఖ పాత్ర పోషించాడు. 473 పరుగులతో సీజన్ టాప్ స్కోరర్‌గా నిలిచి, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గాను నిలిచాడు.
"బాబర్ అజమ్ మిలియన్ డాలర్ ప్లేయర్. అతడు బ్యాటింగ్ చేస్తుంటే చాలా బాగుంటుంది. చూడటానికి రెండు కళ్లు సరిపోవు. బాబర్ గురించి మీరేం అంటారు" అని అశ్విన్ ఇంజిమామ్ను అడిగాడు.
"అతడు(బాబర్) చాలా అద్భుతమైన ప్లేయర్. ఇంకా బాగా ఆడాలి. ఎవరైనా ఆటగాడు తన కెరీర్లో అత్యుత్తమ దశను చేరుకోవాలంటే దాదాపు ఏడేళ్లు పడుతుంది. కానీ ఈ ఆటగాడు ఐదేళ్లలోనే దానిని అందుకున్నాడు. రానున్న సంవత్సరాల్లో మరింతగా రాణించాలని కోరుకుంటున్నాను" అని ఇంజిమామ్ చెప్పాడు.
పాక్ జట్టు అన్ని ఫార్మాట్లకు బాబర్‌నే కెప్టెన్‌గా నియమిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం అధికారికంగా ప్రకటించింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">