ETV Bharat / sports

టీ20 ప్రపంచకప్​ వాయిదా.. వచ్చేవారం అధికార ప్రకటన!

author img

By

Published : Jul 7, 2020, 7:25 AM IST

Updated : Jul 7, 2020, 10:17 AM IST

అక్టోబర్​ లేదా నవంబర్​లో ఇంగ్లాండ్​తో జరిగే ద్వైపాక్షిక సిరీస్​కు సిద్ధమవ్వాలని క్రికెట్​ ఆస్ట్రేలియా.. ఆ దేశ క్రికెటర్లకు సూచించిందని సమాచారం. ఇంగ్లీష్​ జట్టుతో పరిమిత ఓవర్ల సిరీస్​ ఆడాలని నిర్ణయించిన నేపథ్యంలో ఇక ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ-20 ప్రపంచకప్​ వాయిదా పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Australian players told get ready for England series as T20 WC set to be postponed: Reports
టీ20 ప్రపంచకప్​ వాయిదా.. వచ్చే వారం అధికార ప్రకటన!

ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది జరగాల్సిన టీ20 ప్రపంచకప్​ వాయిదా వేయడానికి ఐసీసీ సుముఖత చూపిస్తుందని సమాచారం. త్వరలోనే అధికార ప్రకటన రాబోతుందని ప్రచారం జరుగుతోంది. దీంతో ఇంగ్లాండ్​ వేదికగా ద్వైపాక్షిక సిరీస్​కు సిద్ధమవ్వాలని ఆసీస్​ క్రికెటర్లకు ఆ దేశ క్రికెట్​ బోర్డు తెలిపిందని ఓ వార్తాపత్రిక నివేదించింది. ఈ పరిణామాల మధ్య ఐసీసీ టీ20 ప్రపంచకప్​ వాయిదా పడనుందని సమాచారం.

"టీ20 ప్రపంచకప్​ వాయిదా వేస్తున్నామని మరో వారంలో ఐసీసీ అధికారిక ప్రకటన చేయనుంది. దీంతో ఆటగాళ్లంతా ఇంగ్లాండ్​ పర్యటనకు సిద్ధం కావాలని క్రికెట్​ ఆస్ట్రేలియా తెలిపింది. బయో సెక్యూర్​ వాతావరణంలో ఇంగ్లాండ్​, ఆస్ట్రేలియా మధ్య ద్వైపాక్షిక సిరీస్​ జరగనుంది. ఇంగ్లీష్​ జట్టుతో పరిమిత ఓవర్ల సిరీస్​ ముగిసిన తర్వాత ఆసీస్​ ఆటగాళ్లు సరాసరి ఐపీఎల్​లో పాల్గొంటార"ని ఆస్ట్రేలియన్​ వార్తాపత్రిక నివేదించింది.

ప్రస్తుతం సంక్షోభ పరిస్థితుల్లో టీ20 ప్రపంచకప్​ నిర్వహణ సాధ్యం కాదని ఆస్ట్రేలియా క్రికెట్​ బోర్డు(సీఏ) ఇప్పటికే తెలిపింది. ఈ క్రమంలో అక్టోబరు-నవంబరులో ఐపీఎల్​ నిర్వహించడానికి మార్గం సుగమం అయినట్లేనని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చూడండి... 'ఐపీఎల్​ను జరిపితే అందరూ ప్రశ్నిస్తారు'

Last Updated : Jul 7, 2020, 10:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.