న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా పేసర్ కేన్ రిచర్డ్‌సన్‌కు కొవిడ్-19 (కరోనా వైరస్) పరీక్షలు చేశారు. అతడికి గొంతులో మంటగా అనిపిస్తోందని చెప్పిన కారణంగా క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. రిచర్డ్‌సన్‌ను ప్రత్యేకంగా ఉంచి, వైద్యుల బృందంతో పర్యవేక్షిస్తున్నామని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రతినిధి ఒకరు చెప్పారు. ఫలితంగా నేడు కివీస్‌తో జరుగుతున్న తొలి వన్డేకు దూరమయ్యాడని, అతడికి బదులు సీన్ అబాట్‌ను ఎంపిక చేశామని అన్నారు.
అయితే రిచర్డ్‌సన్, సాధారణ గొంతు సమస్యతోనే బాధపడుతున్నాడని తమ వైద్యబృందం భావిస్తోందని సీఏ ప్రతినిధి స్పష్టం చేశారు. అయినా, ఆస్ట్రేలియా ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను తప్పకుండా పాటిస్తామన్నారు. రిచర్డ్‌సన్ ఇటీవలే విదేశాల నుంచి తిరిగొచ్చాడని, ఈ నేపథ్యంలో అతడిని జట్టుకు దూరంగా ఉంచి పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. కొద్దిరోజుల్లో అతడు కోలుకుంటాడని, తిరిగి జట్టులో చేరతాడని సదరు ప్రతినిధి ఆశాభావం వ్యక్తం చేశారు.
ఖాళీ మైదానాల్లోనే ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ సిరీస్
న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు ప్రేక్షకులను అనుమతించట్లేదని, టికెట్లు కొన్నవారికి డబ్బు తిరిగి చెల్లిస్తామని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది.