ETV Bharat / sports

'బుట్టబొమ్మ'కు స్టెప్పులు వేయడం కష్టమే: వార్నర్​ - బుట్టబొమ్మ'కు స్టెప్పులు వేయడం కష్టమే

'అల వైకుంఠపురములో'ని బుట్టబొమ్మ పాటకు స్టెప్పులు వేయడం కష్టంగా అనిపించిందని అన్నాడు ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌. ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో పాల్గొన్న ఇతడు ఓపెనర్‌ రోహిత్‌ శర్మతో ఈ విషయాన్ని చెప్పాడు.

Australian opener David Warner said it was difficult to dance Butta Bomma Song  'Ala Vaikunthapuramulo'
బుట్టబొమ్మ'కు స్టెప్పులు వేయడం కష్టమే'
author img

By

Published : May 9, 2020, 8:22 AM IST

తెలుగు సినిమా 'అల వైకుంఠపురములో'ని బుట్టబొమ్మ పాటకు డ్యాన్స్‌ చేయడం కష్టంగా అనిపించిందని ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ తెలిపాడు. టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మతో ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో ఈ విషయాన్ని తెలిపాడు.

ఈ మధ్య టిక్‌టాక్‌లో అదరగొడుతున్నావు, ఓ తెలుగు సినిమా పాటకు కూడా డ్యాన్స్‌ చేసినట్లున్నావు అని రోహిత్‌ అడగ్గా.. "అవును. బుట్టబొమ్మ పాటకు డ్యాన్స్‌ చేశా. అందుకోసం చాలా కష్టపడ్డా. టాలీవుడ్‌, బాలీవుడ్‌ పాటల స్టెప్పులు నేర్చుకోవడం కష్టం. నా కూతురు వల్లే టిక్‌టాక్‌ వీడియోలు చేయడం అలవాటైంది" అని వార్నర్‌ చెప్పాడు. దీంతో పాటు క్రికెట్‌ గురించి మాట్లాడుతూ వార్నర్​.

"ఈ ఏడాది అక్టోబర్‌లో పురుషుల టీ20 ప్రపంచకప్‌ నిర్వహణ కష్టమే. ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్‌ జరిగే అవకాశాల్లేవు. 16 జట్లను ఒక్కచోటికి చేర్చడం కష్టం. 2018లో భారత్‌తో సిరీస్‌లో ఆస్ట్రేలియా ఓడిపోతుంటే బాధగా అనిపించిందని, జట్టులో లేకపోవడం వల్ల ఏం చేయలేకపోయాను."

-వార్నర్​, క్రికెటర్​.

ఈ ఏడాది చివర్లో భారత.. ఆస్ట్రేలియా పర్యటనతో తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌కు గొప్ప ఆరంభం లభించే అవకాశముందని రోహిత్‌ తెలిపాడు.

ఇదగీ చూడండి : క్రికెట్‌ మక్కాలో.. 'సర్కార్'​ శతకం ప్రత్యేకం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.