ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 87 పరుగుల తేడాతో శ్రీలంకపై గెలిచింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించిన ఆసీస్.. ఈ ప్రపంచకప్‌లో నాలుగో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. లంక కెప్టెన్ కరుణరత్నే 97 పరుగులు చేసినా జట్టును గెలిపించలేకపోయాడు.
-
Australia win by 87 runs!
— Cricket World Cup (@cricketworldcup) June 15, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
It was all going so well for Sri Lanka before a late innings collapse saw Australia seal their fourth win of #CWC19. pic.twitter.com/ACKTeee6Q2
">Australia win by 87 runs!
— Cricket World Cup (@cricketworldcup) June 15, 2019
It was all going so well for Sri Lanka before a late innings collapse saw Australia seal their fourth win of #CWC19. pic.twitter.com/ACKTeee6Q2Australia win by 87 runs!
— Cricket World Cup (@cricketworldcup) June 15, 2019
It was all going so well for Sri Lanka before a late innings collapse saw Australia seal their fourth win of #CWC19. pic.twitter.com/ACKTeee6Q2
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది ఆస్ట్రేలియా. తొలి వికెట్‌కు 80 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పింది ఫించ్- వార్నర్ జోడి. అనంతరం 26 పరుగులు చేసి వార్నర్ ఔటయ్యాడు. వార్నర్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన ఖవాజా 10 పరుగులకే వెనుదిరిగాడు.
కెప్టెన్ అదరగొట్టాడు
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన స్మిత్‌తో కలిసి మూడో వికెట్‌కు 173 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు ఆసీస్ కెప్టెన్. ఈ క్రమంలో 153 పరుగులు చేశాడు. స్మిత్ 73 పరుగులు చేసి మలింగ బౌలింగ్‌లో వెనుదిరిగాడు.
-
1️⃣5️⃣3️⃣ off 1️⃣ 3️⃣ 2️⃣ balls 🙌 #AaronFinch is the Player of the Match 👏 pic.twitter.com/8mGzOIwelt
— Cricket World Cup (@cricketworldcup) June 15, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">1️⃣5️⃣3️⃣ off 1️⃣ 3️⃣ 2️⃣ balls 🙌 #AaronFinch is the Player of the Match 👏 pic.twitter.com/8mGzOIwelt
— Cricket World Cup (@cricketworldcup) June 15, 20191️⃣5️⃣3️⃣ off 1️⃣ 3️⃣ 2️⃣ balls 🙌 #AaronFinch is the Player of the Match 👏 pic.twitter.com/8mGzOIwelt
— Cricket World Cup (@cricketworldcup) June 15, 2019
చివర్లో మాక్స్వెల్ ఆకాశమే హద్దుగా చెలరేగి 25 బంతుల్లో 46 పరుగులు చేసిన జట్టు భారీ స్కోరు చేయడంలో సహకరించాడు. మిగతా వారిలో షాన్ మార్ష్ 3, కేరీ 4, కమిన్స్ 0, స్టార్క్ 5 పరుగులు చేశారు.
లంక బౌలర్లలో ఉదానా, డిసిల్వా తలో రెండు వికెట్లు, మలింగ ఒక వికెట్ దక్కించుకున్నారు.
ప్రారంభం అదిరింది కానీ...
అనంతరం 335 లక్ష్యంతో బరిలో దిగిన లంక.. ఛేదన ధాటిగానే ఆరంభించింది. తొలి వికెట్‌కు 115 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు ఓపెనర్లు. అనంతరం కెప్టెన్ కరుణరత్నే ఓ ఎండ్‌లో వేగంగా ఆడుతున్నా అతడికి సహకారమందించే వారు కరవయ్యారు. ఈ క్రమంలో 97 పరుగులు చేసి లంక సారథి పెవిలియన్ బాట పట్టాడు.
మిగతా వారిలో కుశాల్ పెరీరా 52, తిరుమన్నే 16, కుశాల్ మెండిస్ 30, మాథ్యూస్ 9, సిరివర్ధన 3, తిశారీ పెరీరా 7, ధనుంజయ డిసిల్వా 16, ప్రదీప్ 0, మలింగ 1, ఉదానా 8 పరుగులు చేశారు.
కంగారూ బౌలర్లలో స్టార్క్ 4, రిచర్డ్సన్ 3, కమిన్స్ 2, బెహరాన్డార్ఫ్ 1 వికెట్ తీశారు.