పాకిస్థాన్ క్రికెట్ జట్టు మరో సిరీస్‌లో ఓడిపోయింది. టీ20ల్లో ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్న పాక్.. ఇటీవలే లంక చేతిలో పరాభవం చెందింది. ఇప్పుడు ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది.
ఆస్ట్రేలియా-పాకిస్థాన్ మధ్య శుక్రవారం మూడో టీ20 జరిగింది. ఈ మ్యాచ్‌లో సునాయాస విజయం సాధించారు కంగారూలు. సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకున్నారు.
పెర్త్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పాక్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. ఇఫ్తికర్ అహ్మద్(45), ఇమాముల్ హక్ (14) తప్ప మరెవరూ రెండంకెల స్కోరు చేయలేదు.
ఛేదనలో వార్నర్(48*), ఫించ్(52*) ధాటికి వికెట్ కోల్పోకుండా 11.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది ఆసీస్.
-
It's all over!
— cricket.com.au (@cricketcomau) November 8, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Australia win by 10 wickets, with Aaron Finch 52* and David Warner 48* unbeaten.#AUSvPAK scorecard: https://t.co/1Sp0RBStoh pic.twitter.com/wMFKuxkuxE
">It's all over!
— cricket.com.au (@cricketcomau) November 8, 2019
Australia win by 10 wickets, with Aaron Finch 52* and David Warner 48* unbeaten.#AUSvPAK scorecard: https://t.co/1Sp0RBStoh pic.twitter.com/wMFKuxkuxEIt's all over!
— cricket.com.au (@cricketcomau) November 8, 2019
Australia win by 10 wickets, with Aaron Finch 52* and David Warner 48* unbeaten.#AUSvPAK scorecard: https://t.co/1Sp0RBStoh pic.twitter.com/wMFKuxkuxE
ఆసీస్ బౌలర్ సీన్ అబాట్ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలిచాడు. 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్' స్టీవ్ స్మిత్‌కు దక్కింది.
త్వరలో ఈ రెండు జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్ జరగనుంది. బ్రిస్బేన్ వేదికగా మొదటి మ్యాచ్, ఆడిలైడ్‌లో రెండో టెస్టు జరగనుంది.
వరుస పరాజయాలు...
టీ20ల్లో పాకిస్థాన్ సారథిగా సర్ఫరాజ్ అహ్మద్‌ను తొలగించి బాబర్ అజామ్‌కు బాధ్యతలు అప్పగించింది పాక్ క్రికెట్ బోర్డు(పీసీబీ). కెప్టెన్‌ను మార్చినా పాకిస్థాన్ రాత మారలేదు. ఇటీవలే లంక చేతిలో, ఇప్పుడు ఆసీస్ చేతిలో ఓడింది.
గత 15 సిరీస్‌ల్లో పదకొండు గెలిచిన పాక్.. ఇటీవలే జరిగిన సిరీస్‌ల్లో( దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, శ్రీలంక, ఆసీస్) నాలుగింట్లో ఓటమిపాలైంది.
పాకిస్థాన్.. 2017లో 10 మ్యాచ్‌లు ఆడి 8 గెలవగా...2018లో 19 మ్యాచ్‌ల్లో 17 విజయాలు నమోదు చేసింది. ఈ ఏడాది ఆ గణాంకాలు మారాయి. ఇప్పటివరకు 10 మ్యాచ్‌ల్లో ఒక్కటి మాత్రమే గెలిచింది, మరొకటి వర్షం కారణంగా డ్రా అయింది. 8 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.