ఈ ఏడాది టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన బ్యాట్స్‌మన్ ఎవరో తెలుసా? ఏముంది.. విరాట్ కోహ్లీనో, స్టీవ్ స్మిత్ అయి ఉంటాడో అనుకుంటున్నారా! వీళ్లెవరూ కాదు.. ఆస్ట్రేలియా ఆటగాడు మార్నస్ లబుషేన్.. ఈ ఘనత సాధించాడు. 2019లో 779 పరుగులు చేసి కోహ్లీ, స్మిత్‌ను అధిగమించాడు.
-
Leading run-scorers in Test cricket in 2019:
— cricket.com.au (@cricketcomau) November 29, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
779* - Marnus Labuschange (AUS)
778 - Steve Smith (AUS)
754- Mayank Agarwal (IND)
746 - Ben Stokes (ENG)
642 - Ajinkya Rahane (IND) #AUSvPAK
">Leading run-scorers in Test cricket in 2019:
— cricket.com.au (@cricketcomau) November 29, 2019
779* - Marnus Labuschange (AUS)
778 - Steve Smith (AUS)
754- Mayank Agarwal (IND)
746 - Ben Stokes (ENG)
642 - Ajinkya Rahane (IND) #AUSvPAKLeading run-scorers in Test cricket in 2019:
— cricket.com.au (@cricketcomau) November 29, 2019
779* - Marnus Labuschange (AUS)
778 - Steve Smith (AUS)
754- Mayank Agarwal (IND)
746 - Ben Stokes (ENG)
642 - Ajinkya Rahane (IND) #AUSvPAK
778 పరుగులతో స్టీవ్ స్మిత్ ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఇటీవల రెండు డబుల్ శతకాలతో ఆకట్టుకున్న మయాంక్ అగర్వాల్ 754 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. బెన్ స్టోక్స్, అజింక్య రహానే తర్వాతి స్థానాల్లో నిలిచారు. 612 పరుగులతో విరాట్ కోహ్లీ ఈ జాబితాలో 7వ స్థానంతో సరిపెట్టుకున్నాడు.
ఆగస్టులో జరిగిన యాషెస్ సిరీస్ రెండో టెస్టులో స్టీవ్ స్మిత్ స్థానంలో కాంకషన్‌గా వచ్చిన లబుషేన్ అప్పటి నుంచి అదరగొడుతున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న పాకిస్థాన్‌తో సిరీస్‌లోనూ రెండు శతకాలు(185, 126) చేశాడు. 11 టెస్టులాడిన అనుభవం ఉన్న లబుషేన్.. మొత్తం 874 పరుగులు ఖాతాలో వేసుకున్నాడు. ఇందులో రెండు సెంచరీలు సహా 5 అర్ధశతకాలు ఉన్నాయి.
ఇదీ చదవండి: ఇంగ్లాండ్‌పై లాథమ్ శతకం.. కివీస్ స్కోరు 173/3