కరోనా వైరస్ ప్రభావం మరో టోర్నీపై పడింది. ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ వాయిదా పడింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి వన్డేలో ఆసీస్, 71 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ను ఖాళీ మైదానంలోనే నిర్వహించారు.
న్యూజిలాండ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా కివీస్ ఆటగాళ్లు తక్షణమే ఆస్ట్రేలియాను వీడి స్వదేశానికి పయనం అయ్యారు. అక్కడికి చేరుకున్న వెంటనే వారు 14 రోజులు ఐసోలేషన్‌లో ఉండనున్నారు.
ఫెర్గూసన్‌కు గొంతునొప్పి
మొదటి వన్డే అనంతరం న్యూజిలాండ్ క్రికెటర్ ఫెర్గూసన్ గొంతు నొప్పిగా ఉందని అన్నాడు. అప్రమత్తమైన యాజమాన్యం.. జట్టు బస చేసిన హోటల్లో అతడిని ప్రత్యేకంగా ఉంచినట్లు కివీస్ టీమ్ ప్రతినిధి మీడియాకు చెప్పాడు. 24 గంటల పాటు పర్యవేక్షణలో ఉంచనున్నామని అన్నాడు.