ఆస్ట్రేలియాకు చెందిన మహిళా అంపైర్ క్లెయర్ పొలోసక్ చరిత్ర సృష్టించింది. పురుషుల టెస్టు మ్యాచ్‌కు అఫీషయల్గా వ్యహరించబోతున్న తొలి మహిళా అంపైర్‌గా ఘనత సాధించింది. భారత్-ఆస్ట్రేలియా మధ్య గురువారం ప్రారంభమయ్యే సిడ్నీ టెస్టుకు పొలోసక్ పోర్త్ అంపైర్‌గా బాధ్యతలు నిర్వర్తించనుంది.
న్యూ సౌత్‌వేల్స్‌కు చెందిన 32 ఏళ్ల పొలోసక్ ఇప్పటికే పురుషుల వన్డే మ్యాచ్‌కు అంపైర్‌గా వ్యవహరించిన తొలి మహిళగా రికార్డులకెక్కింది. 2019లో నమీబియా-ఒమన్ మధ్య జరిగిన ఐసీసీ డివిజన్-2 లీగ్ మ్యాచ్‌లో ఆన్ ఫీల్డ్ అంపైర్‌గా చేసింది.
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగబోయే మూడో టెస్టుకు పాల్ రీఫిల్, పాల్ విల్సన్ ఆన్‌ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించనుండగా, బ్రూస్ అక్సన్ఫోర్డ్ టీవీ అంపైర్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. మ్యాచ్ రిఫరీగా డేవిడ్ బూన్ ఉండనున్నాడు.
ఫోర్త్ అంపైర్ బాధ్యతలు
కొత్త బంతిని తీసుకురావడం, ఫీల్డ్ అంపైర్లకు కూల్‌డ్రింక్స్ ఇవ్వడం, లైట్ మీటర్లో బ్యాటరీ పవర్ చెక్ చేయడం, లంచ్, టీ విరామాల్లో పిచ్ పరిస్థితి గమనించడం ఫోర్త్ అంపైర్ బాధ్యతలు. అలాగే ఫోర్త్ అంపైర్ కొన్నిసార్లు థర్డ్ అంపైర్ పొజిషన్లోకి వెళ్లవచ్చు. ఆన్‌ఫీల్డ్ అంపైర్లకు ఏదైనా జరిగితే వారి స్థానంలో థర్డ్ అంపైర్ బాధ్యతలు నిర్వర్తిస్తే.. థర్డ్ అంపైర్ ప్లేస్‌లోకి ఫోర్త్ అంపైర్ వెళ్లాల్సి ఉంటుంది.