ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్.. టెస్టుల్లో తన ఆధిపత్యం కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం టెస్టుల్లో నెం.1 స్థానంలో ఉన్న అతడు.. తాజాగా 7వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.
ట్రాక్ రికార్డు..
2010 జులై 13న పాకిస్థాన్‌పై తొలి టెస్టులో అరంగేట్రం చేశాడు స్మిత్. సుదీర్ఘ ఫార్మాట్లో తిరుగులేని ఆటగాడిగా దూసుకెళ్తున్నాడు. తాజాగా 7వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఈ ఘనతను అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో (126) సాధించి రికార్డు సృష్టించాడు. ఫలితంగా ఇప్పటివరకు వాలీ హమండ్ (131) పేరిట ఉన్న రికార్డు 73 ఏళ్ల తర్వాత బ్రేక్ అయింది.
వేగంగా 7వేల పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో భారత్‌కు చెందిన వీరేంద్ర సెహ్వాగ్(134 ఇన్నింగ్స్) స్థానంలో ఉన్నాడు.
-
The fastest to 7K - you're a star Steve Smith! ⭐#AUSvPAK pic.twitter.com/sU7uxN8vGR
— cricket.com.au (@cricketcomau) November 30, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">The fastest to 7K - you're a star Steve Smith! ⭐#AUSvPAK pic.twitter.com/sU7uxN8vGR
— cricket.com.au (@cricketcomau) November 30, 2019The fastest to 7K - you're a star Steve Smith! ⭐#AUSvPAK pic.twitter.com/sU7uxN8vGR
— cricket.com.au (@cricketcomau) November 30, 2019
బ్రాడ్‌మన్‌ను వెనక్కి నెట్టి..
ఆసీస్ దిగ్గజ ఆటగాడు డాన్ బ్రాడ్‌మన్ కెరీర్లో 6వేల 996 టెస్టు పరుగులు చేశాడు. తాజాగా స్మిత్ అతడిని అధిగమించి.. 7వేల పరుగుల మైలురాయిని అందుకున్న 11వ ఆస్ట్రేలియా క్రికెటర్‌గా పేరు తెచ్చుకున్నాడు. అయితే టెస్టు కెరీర్లో ఈ పరుగులు చేయడానికి బ్రాడ్‌మన్ 52 మ్యాచ్‌లు మాత్రమే తీసుకోగా.. స్మిత్ మాత్రం 70 టెస్టుల్లో పూర్తి చేశాడు.