ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ కెరీర్లో తొలిసారి ట్రిపుల్ సెంచరీ చేశాడు. ఆస్ట్రేలియా తరఫున టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. అడిలైడ్ వేదికగా పాక్‌తో జరుగుతోన్న రెండో టెస్టులో ఈ ఘనత సాధించాడు. గులాబి బంతితో ఆడుతోన్న ఈ మ్యాచ్‌లో.. 389 బంతుల్లో త్రిశతకం బాదేశాడు. ఇందులో 37 ఫోర్లు ఉన్నాయి.
కెరీర్లో అత్యధికం...
2015లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో 253 పరుగుల వ్యక్తిగత అత్యధికం నమోదు చేశాడు వార్నర్. ప్రస్తుతం జరగుతోన్న మ్యాచ్‌లో ఆ రికార్డును బ్రేక్ చేసి తొలిసారి 300 మార్కు అందుకున్నాడు. తక్కువ బంతుల్లో (389) త్రిశతకం సాధించిన నాలుగో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
- వీరేంద్ర సెహ్వాగ్(278 బంతుల్లో) దక్షిణాఫ్రికాపై- 2007-08
- మాథ్యూ హెడెన్(362 బంతుల్లో) జింబాంబ్వేపై- 2003-04
- వీరేంద్ర సెహ్వాగ్(364 బంతుల్లో) పాకిస్థాన్‌పై-2003-04
పాకిస్థాన్‌పై రెండో అత్యధిక స్కోరు చేసిన ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు వార్నర్.
2016 తర్వాత ఈ ఏడాదే రెండు త్రిశతకాలు నమోదయ్యాయి. ఒకరు కరుణ్ నాయర్ (భారత్) కాగా... రెండో ఆటగాడు డేవిడ్ వార్నర్(ఆస్ట్రేలియా).
-
History made! 😎#AUSvPAK | https://t.co/0QSefkJERk pic.twitter.com/SR2EjqKQrf
— cricket.com.au (@cricketcomau) November 30, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">History made! 😎#AUSvPAK | https://t.co/0QSefkJERk pic.twitter.com/SR2EjqKQrf
— cricket.com.au (@cricketcomau) November 30, 2019History made! 😎#AUSvPAK | https://t.co/0QSefkJERk pic.twitter.com/SR2EjqKQrf
— cricket.com.au (@cricketcomau) November 30, 2019
-
87 ఏళ్ల రికార్డు బ్రేక్...
అడిలైడ్ స్టేడియంలో 1931-32 మధ్య దక్షిణాఫ్రికాపై బ్రాడ్‌మన్ కొట్టిన 299* ఇప్పటివరకు వ్యక్తిగత అత్యధికం. కానీ ఈ మ్యాచ్‌లో 300 పైగా పరుగులు చేసిన వార్నర్... 87 ఏళ్ల తర్వాత ఈ మైదానంలో హైస్కోరు సాధించాడు.
భారీ ఆధిక్యం దిశగా...
వికెట్ నష్టానికి 302 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆస్ట్రేలియా.. రెండో రోజు పాకిస్థాన్ బౌలర్లను ఉతికారేసింది. తొలి టెస్టులో గెలిచిన ఆస్ట్రేలియా.. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. ఇప్పటికే ఆసీస్ గడ్డపై వరుసగా 13 టెస్టుల్లో ఓడిన రికార్డు పాకిస్థాన్ పేరిట ఉంది.