ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో టాపర్‌గా నిలిచింది ఆస్ట్రేలియా. తాజాగా ఐసీసీ ప్రకటించిన జాబితాలో భారత్ రెండోస్థానానికి పడిపోయింది. భారత్‌కు ఎక్కువ పాయింట్లు ఉన్నప్పటికీ విజయాల శాతం ఆధారంగా కంగారూ జట్టుకే అగ్రపీఠం దక్కింది. ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న ఆసీస్-భారత్ సిరీస్ మరింత రసవత్తరంగా మారనుంది.
-
🇦🇺 Today's announcement means Australia jump past India to claim 🔝 spot in the ICC World Test Championship 🏆 pic.twitter.com/Pjitqfu2pg
— ICC (@ICC) November 19, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">🇦🇺 Today's announcement means Australia jump past India to claim 🔝 spot in the ICC World Test Championship 🏆 pic.twitter.com/Pjitqfu2pg
— ICC (@ICC) November 19, 2020🇦🇺 Today's announcement means Australia jump past India to claim 🔝 spot in the ICC World Test Championship 🏆 pic.twitter.com/Pjitqfu2pg
— ICC (@ICC) November 19, 2020
ప్రస్తుతం ఆస్ట్రేలియా (296 పాయింట్లు, గెలుపు శాతం 82.22 ), భారత్ (360 పాయింట్లు, 75%), ఇంగ్లాండ్ (292 పాయింట్లు, 60.83%), న్యూజిలాండ్ (180 పాయింట్లు, 50%), పాకిస్థాన్ (166 పాయింట్లు, 39.52%) తొలి అయిదు స్థానాల్లో ఉన్నాయి. విజయాల శాతం ఆధారంగానే ఫైనల్‌కు జట్లు అర్హత సాధించనున్నాయి.
టెస్టుల ర్యాంకింగ్‌లో తొమ్మిది అగ్రశ్రేణి జట్లు, రెండేళ్లలో ఆరు సిరీస్‌లు ఆడాల్సి ఉంది. ప్రతి సిరీస్‌కు గరిష్టంగా 120 పాయింట్లను లెక్కిస్తారు. సిరీస్‌లోని మ్యాచ్‌ల సంఖ్య ఆధారంగా పాయింట్ల పంపిణీ జరిగేది. అయితే కరోనా నేపథ్యంలో పలు సిరీస్‌లు రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో నిబంధనల్లో మార్పుల ప్రకారం అధిక విజయాల శాతం కలిగిన టాప్-2 జట్లే.. వచ్చే ఏడాది జూన్‌లో లార్డ్స్ వేదికగా ఫైనల్ ఆడనున్నాయి. గెలిచిన జట్టు ప్రపంచ ఛాంపియన్‌షిప్ విజేతగా నిలుస్తుంది.