టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీని స్ఫూర్తిగా తీసుకుని తనను తాను మంచి ఫినిషర్‌గా తీర్చుదిద్దుకుంటున్నానని చెప్పింది ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ గ్రేస్ హ్యారిస్. మహీలా ఓ గొప్ప ఫినిషర్‌గా తయారవుతానని ధీమా వ్యక్తం చేసింది.
"నేను ధోనీ ఇన్నింగ్స్‌ను చూస్తూ స్ఫూర్తి పొందుతా. ఆయన అంచనాలు లేని ఎన్నో మ్యాచ్‌లను ముందుండి విజయం వైపు నడిపించారు. మహీలా ఎప్పటికైనా ఓ గొప్ప ఫినిషర్‌గా ఎదుగుతానని భావిస్తున్నా."
-గ్రేస్ హ్యారిస్, ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్.
2015లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన హ్యారిస్... ఇప్పటివరకు ఆడిన తొమ్మిది వన్డేల్లో 15 పరుగులు, 11 టీ20ల్లో 120 పరుగులు చేసింది.
ఇదీ చూడండి ఆస్పత్రి నుంచి కపిల్ దేవ్ డిశ్చార్జ్