ETV Bharat / sports

యాషెస్: సిరీస్​పై కన్నేసిన ఆసీస్.. డ్రా కోసం ఇంగ్లాండ్​ - ausis

లండన్​లోని ఓవల్ వేదికగా ఇంగ్లాండ్- ఆస్ట్రేలియా మధ్య యాషెస్ చివరి టెస్టు నేటి నుంచి జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. 2-1 ఆధిక్యంలో ఉన్న కంగారూ జట్టు సిరీస్​ను చేజిక్కించుకోవాలని చూస్తోంది.

యాషెస్
author img

By

Published : Sep 12, 2019, 5:18 AM IST

Updated : Sep 30, 2019, 7:21 AM IST

ఇంగ్లాండ్​ గడ్డపై ఆస్ట్రేలియా యాషెస్ నెగ్గి 18 ఏళ్లయింది. రికీ పాంటింగ్, క్లార్క్ లాంటి దిగ్గజ సారథుల వల్ల కానీ ఘనతకు అడుగు దూరంలో ఉన్నాడు ఆసీస్ కెప్టెన్ టిమ్​పైన్. ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో నిలిచిన కంగారూ జట్టు చివరిదైన ఐదో టెస్టును డ్రా చేసుకున్నా.. సిరీస్​ను కైవసం చేసుకుంటుంది. లండన్​లోని ఓవల్ వేదికగా ఇరు జట్ల మధ్య యాషెస్ ఐదో టెస్టు జరగనుంది.

సిరీస్ కోల్పోకుండా ఉండాలంటే చివరి టెస్టులో ఇంగ్లాండ్ తప్పక గెలవాల్సి ఉంటుంది. ముఖ్యంగా 671 పరుగులతో సిరీస్​ టాప్​ స్కోరర్​గా ఉన్న ఆసీస్​ తురుపు ముక్క స్టీవ్ స్మిత్​ను కట్టడి చేయాలి. ఇంగ్లాండ్​లో బెన్ స్టోక్స్, రోరీ బర్న్స్ మినహా మిగతా ఆటగాళ్లు రాణించట్లేదు. వారు పుంజుకోవాలి. ఈ సిరీస్​లో 354 పరుగులతో ఇంగ్లీష్ జట్టు తరపున టాప్ స్కోరు చేసింది స్టోక్సే. కెప్టెన్ రూట్ ఫామ్​లోకి రావాల్సి ఉంది.

ASHES
ఇంగ్లాండ్ కెప్టెన్ రూట్

అండర్సన్ గైర్హాజరుతో బౌలింగ్ విభాగం బలహీనంగా మారింది. కొత్త బంతితో స్టువర్ట్ బ్రాడ్, జోఫ్రా ఆర్చర్ నిలకడగా రాణిస్తున్నప్పటికీ.. స్మిత్​ జోరుకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. అతడు క్రీజులో ఉన్న ప్రతి నిమిషం గెలుపుపై ఇంగ్లాండ్​కు ఆశలు సన్నగిల్లుతున్నాయి.

నాలుగో టెస్టులో గాయం కారణంగా బెన్ స్టోక్స్ బౌలింగ్ చేయలేదు. ఐదో టెస్టులో అతడు బ్యాటింగ్​కే పరిమితమయ్యే అవకాశముంది. ఇప్పటికే సామ్ కరన్, క్రిస్ వోక్స్.. ఇద్దరికి చివరి టెస్టుకు అవకాశం కల్పించింది ఇంగ్లాండ్.

ASHES
నాలుగో టెస్టు విజయానంతరం ఆసీస్

ప్రస్తుత యాషెస్ సిరీస్​లో ఆస్ట్రేలియా జట్టులో గుర్తుకువచ్చే ఒకే ఒక్క పేరు స్టీవ్ స్మిత్. తొలి టెస్టు నుంచి ఇప్పటివరకు కష్ట సమయాల్లో జట్టును ఆదుకుంటున్నాడు. రెండో టెస్టులో స్మిత్​కు గాయమవడం వల్ల ఆ మ్యాచ్ డ్రాగా ముగిసింది. మూడో టెస్టుకు స్మిత్ దూరమవడంతో బెన్ స్టోక్స్ అద్భుత పోరాటం వల్ల ఇంగ్లాండ్​ గెలిచింది. స్మిత్​ లేకపోవడం జట్టుపై ఎంత ప్రభావం చూపిందనడానికి ఇదే ఉదాహరణ. ఐదు ఇన్నింగ్స్​ల్లో

ASHES
స్టీవ్ స్మిత్

134 సగటుతో 671 పరుగులు చేశాడు స్మిత్. ఇందులో మూడు శతకాలు(144, 142, 211) రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి.
మూడో టెస్టులో స్మిత్ దూరమైనప్పటికీ నిలకడైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు కాంకషన్​గా వచ్చిన లబుషేన్. వరుసగా మూడు అర్ధశతకాలతో రాణించాడు. బౌలింగ్ విభాగంలో కమిన్స్, హేజిల్​వుడ్ భీకరమైన ఫామ్​లో ఉన్నారు. వీరిద్దరూ కలిసి ఈ సిరీస్​లో 42 వికెట్లు తీశారు.

చివరి టెస్టులో గెలిచి ఇంగ్లాండ్ గడ్డపై 18 ఏళ్ల యాషెస్ సిరీస్ నిరీక్షణకు చెక్​పెట్టాలని చూస్తోంది కంగారూ జట్టు. ఇందులో నెగ్గి సిరీస్​ను డ్రాగా ముగించాలని అనుకుంటోంది ఇంగ్లాండ్.

ఇదీ చదవండి: పాండ్య x పాండ్య ఢీ.. గెలిచింది పాండ్యనే!

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Brussels - 11 September 2019
1. EU flags
2. Wide exterior of the European Commission
3. Arrival of car carrying Britain's chief Brexit negotiator David Frost
4. Camera operator
5. Frost (right of screen, pale blue tie) with UK representative to the EU Tim Barrow (beard)
6. Wide exterior of European Commission
7. Camera operator
8. Wide exterior of Commission
9. TV reporter working
STORYLINE:
Britain's chief Brexit negotiator David Frost arrived in Brussels on Wednesday to meet with European officials for technical talks.
Frost has been meeting with his EU counterparts twice a week since he was appointed in July.  
The latest meeting comes as UK Parliament has been prorogued - or suspended - at the government's request until October 14 as Prime Minister Boris Johnson tries to lead Britain out of the European Union by October 31.
Johnson said he believed a deal could be struck by the next EU summit, when leaders of all 28 EU countries meet in Brussels on 17 and 18 October.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 30, 2019, 7:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.