ETV Bharat / sports

స్మిత్, వేడ్ శతకాల ఊపు.. మ్యాచ్​ ఆసీస్​ వైపు

బర్మింగ్​హామ్ వేదికగా జరుగుతోన్న యాషెస్​ తొలి టెస్టు ఆస్ట్రేలియా వైపు మళ్లింది. నాలుగో రోజు స్మిత్(142), మ్యాథ్యూ వేడ్(110) శతకాలతో ఆకట్టుకున్నారు. ఫలితంగా ఇంగ్లాండ్​కు 398 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు. ప్రస్తుతం బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లీష్ జట్టు వికెట్లేమి కోల్పోకుండా 13 పరుగులు చేసింది. బర్న్స్​(7), జేసన్ రాయ్(6) క్రీజులో ఉన్నారు.

యాషెస్​
author img

By

Published : Aug 5, 2019, 8:24 AM IST

యాషెస్ సిరీస్​ తొలి టెస్టులో పట్టు బిగించిందనుకున్నా ఇంగ్లాండ్​.. ఓటమికి, డ్రాకు మధ్య వేలాడుతుంది. తొలి మూడు రోజులు ఇంగ్లీష్ జట్టు ఆట చూస్తే విజయం ఖాయమే అనుకున్నారు. కానీ అనూహ్యంగా నాలుగో రోజు ఆస్ట్రేలియా​ ప్లేయర్లు స్టీవ్ స్మిత్(142), మ్యాథ్యూ వేడ్(110) శతకాలతో విజృంభించి ఇంగ్లాండ్​ ముందు 398 పరుగులు లక్ష్యాన్ని ఉంచారు. ఒక్క రోజు మాత్రమే ఆట మిగిలి ఉంది. ఇంగ్లీష్ జట్టు మ్యాచ్​ గెలవాలంటే అద్భుతమే జరగాలి. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్​లో 13/0 పరుగులతో ఇంగ్లాండ్​ బ్యాటింగ్ కొనసాగిస్తోంది.

MATCH
ఇంగ్లాండ్ కెప్టెన్ రూట్

ఓవర్​నైట్​ స్కోరు 124/3 పరుగుల వద్ద నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్​ బ్యాట్స్​మెన్ ఇంగ్లీష్ బౌలర్లను ఆటాడుకున్నారు. క్రీజులో ఉన్న స్మిత్ - ట్రేవిస్ హెడ్​ నిలకడగా ఆడుతూ స్కోరు వేగం పెంచారు. అనంతరం హెడ్(51) ఔటైనా.. వేడ్ సాయంతో ఆసీస్​ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు స్మిత్. వీరిద్దరూ 126 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

మరోసారి ఆదుకున్న స్మిత్..

తొలి ఇన్నింగ్స్​లో 144 పరుగుల చేసి ఆస్ట్రేలియాను ఆదుకున్న స్మిత్.. రెండో ఇన్నింగ్స్​లోనూ సత్తాచాటి కంగారూ జట్టును గెలుపు ముంగిట ఉంచాడు. చూడచక్కని కవర్​డ్రైవ్​లు, కట్​ షాట్లతో ఇంగ్లీష్ బౌలర్లకు చెమటలు పట్టించాడు. 65 బంతుల్లో అర్ధశతకం.. 147 బంతుల్లో వంద పరుగులు పూర్తి చేసి కెరీర్​లో 25వ సెంచరీ నమోదు చేశాడు. అనంతరం క్రిస్ వోక్స్ బౌలింగ్​లో ఔటయ్యాడు. కానీ అప్పటికే ఆసీస్​కు అవసరమైన పరుగులు వచ్చాయి.

MATCH
శతకం అనంతరం స్టీవ్ స్మిత్​

శతక్కొట్టిన మ్యాథ్యూ వేడ్​​ ..

ఆరంభంలో స్టీవ్ స్మిత్​కు సహకరిస్తూ ఇన్నింగ్స్ నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన వేడ్​ అనంతరం దూకుడుగా ఆడాడు. స్మిత్ ఔటైన తర్వాత టిమ్​ పైన్​తో(34) కలిసి 76 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పాడు. 131 బంతుల్లో వంద పరుగులు చేసి కెరీర్​లో 3వ సెంచరీ నమెదు చేశాడు. ఇందులో 17 ఫోర్లు ఉన్నాయి. చివర్లో ప్యాటిన్సన్(47నాటౌట్​), కమిన్స్​(26నాటౌట్​) ఆడడం వల్ల ఆసీస్​ 487 పరుగులు వద్ద డిక్లేర్ ఇచ్చింది.

MATCH
మ్యాథ్యూ వేడ్

ఇంగ్లాండ్ బౌలర్లలో స్టోక్స్ 3 వికెట్లు తీయగా.. మొయిన్ అలీ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. బ్రాడ్, క్రిస్ వోక్స్ తలో వికెట్ తీశారు.

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్​: 284/10, 487/7

ఇంగ్లాండ్ ఇన్నింగ్స్​: 374/10, 13/0

ఈ మ్యాచ్​లో రికార్డులు...

  • యాషెస్​ సిరీస్​లో స్మిత్​కు ఇది పదొ శతకం.
  • 2003లో మ్యాథ్యూ హెడెన్​ తర్వాత యాషెస్​ సిరీస్​లో రెండు ఇన్నింగ్స్​ల్లో శతకాలు చేసిన బ్యాట్స్​మెన్​గా స్మిత్ ఘనత సాధించాడు.
  • డాన్ బ్రాడ్​మాన్ తర్వాత వేగంగా 25 సెంచరీలు(32 ఇన్నింగ్స్​ల్లో) చేసిన ఆటగాడిగా స్టీవ్ స్మిత్ రికార్డు సృష్టించాడు. 119 ఇన్నింగ్స్​ల్లో ఈ ఘనత అందుకున్నాడు.
  • ఈ మ్యాచ్​లో మ్యాథ్యూ వేడ్ కెరీర్​లో 3వ సెంచరీతో పాటు వెయ్యి పరుగులు పూర్తి చేశాడు.

ఇది చదవండి: కశ్మీర్​లో జవాన్లతో ధోనీ వాలీబాల్

RESTRICTION SUMMARY: MANDATORY CREDIT: DAYTON POLICE DEPARTMENT
SHOTLIST:
DAYTON POLICE DEPARTMENT - MANDATORY CREDIT: DAYTON POLICE DEPARTMENT
Date and location unknown
1. STILL of Connor Betts, suspect in Dayton shooting in which nine people were killed
STORYLINE:
Police say 24-year-old Connor Betts opened fire in the streets of downtown Dayton at around 1 a.m. (0500GMT) Sunday, killing his sister and eight other adults before he was fatally shot by officers within 30 seconds of the start of the rampage.
Authorities say 27 others were injured.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.