ETV Bharat / sports

పట్టుబిగిస్తున్న ఆసీస్​.. ఇరకాటంలో ఇంగ్లాండ్ - \england

మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న యాషెస్​ నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా పట్టుబిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్​లో భారీ స్కోరు చేసిన ఆసీస్ బంతితోనూ ఆకట్టుకుంటోంది. హెజిల్​వుడ్ 4 వికెట్లతో విజృంభించాడు. మూడో రోజైన శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్​  5 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది.

యాషెస్​
author img

By

Published : Sep 7, 2019, 7:55 AM IST

Updated : Sep 29, 2019, 6:00 PM IST

యాషెస్ నాలుగో టెస్టు ఆస్ట్రేలియా వైపు మొగ్గుతోంది. మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్​​లో ఇంగ్లాండ్ 200 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆసీస్ బౌలర్ జాష్ హెజిల్​వుడ్ 4 వికెట్లతో విజృంభించాడు. ఇంగ్లీష్ బ్యాట్స్​మెన్ రోరీ బర్న్స్(81)​, జోయ్ రూట్(71) అర్ధశతకాలతో ఆకట్టుకున్నప్పటికీ మిగతా ఆటగాళ్లు పెద్దగా రాణించలేదు.

ASHES
4 వికెట్లు తీసిన హెజిల్​వుడ్​

వర్షం వల్ల మూడోరోజు ఉదయం సెషన్​ అంతా తుడిచిపెట్టుకుపోయింది. ఓవర్​నైట్ స్కోరు 23/1 వద్ద బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లీష్ జట్టు ఆరంభంలోనే క్రేగ్ ఓవర్టన్(5) వికెట్ కోల్పోయింది. ఇలాంటి తరుణంలో బర్న్స్​ - రూట్​ జోడి ఇంగ్లాండ్​ ఇన్నింగ్స్ ముందుకు నడిపించింది. వీరిద్దరూ 141 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు.

నిలకడగా ఆడుతున్న బర్న్స్​ను ఔట్ చేసి ఈ జోడీని విడదీశాడు హెజిల్​వుడ్​. అదే ఊపులో రూట్​ను కూడా ఔట్​ చేసి ఇంగ్లాండ్​ను దెబ్బతీశాడు. అనంతరం జేసన్​ రాయ్​నూ పెవిలియన్​కు పంపాడు. మూడోరోజు ఓవర్టన్​తో మొదలైన వికెట్ల పతనాన్ని జేసన్​రాయ్​తో ముగించాడు హెజిల్​వుడ్​. 166/2 పరుగులతో పటిష్ఠ స్థితిలో ఉన్న ఇంగ్లాండ్ హెజిల్​వుడ్​ దెబ్బకు కుదేలైంది.

ASHES
బ్యాటింగ్ చేస్తున్న రూట్

వర్షం కారణంగా మూడో రోజు ఆట 64 ఓవర్లే సాధ్యమైంది. ప్రస్తుతం బెన్ స్టోక్స్​(7), బెయిర్​స్టో(2) క్రీజులో ఉన్నారు. వీరిద్దరిపైనే ఇంగ్లీష్ జట్టు ఆశలు పెట్టుకుంది.

నాలుగో టెస్టులో క్రమంగా పట్టుబిగిస్తోంది ఆసీస్. తొలి ఇన్నింగ్స్​లో 497/8 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది కంగారూ జట్టు. స్టీవ్ స్మిత్(211) డబుల్ సెంచరీతో మరోసారి ఆదుకున్నాడు.

ఇదీ చదవండి: మలింగనా మజాకా.. 4 బంతుల్లో 4 వికెట్లు..!

SNTV Daily Planning Update, 0030 GMT
Saturday 7th September 2019.
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
TENNIS: Highlights from the first US Open semi-final where Daniil Medvedev beat Grigor Dimitrov. Already moved.
TENNIS: Highlights from the second US Open semi-final where Rafael Nadal meets Matteo Berrettini. Expect from 0330.
TENNIS: Reaction from the US Open men's semi-finals. Time tbc.
SOCCER: Reaction after Germany's 4-2 home Euro 2020 qualifying defeat to Netherlands. Already moved.
SOCCER: Barcelona President Josep Maria Bartomeu speaks to the media regarding Neymar. Expect at 0030.
BASEBALL (MLB): Atlanta Braves v. Washington Nationals. Expect at 0400.
BASEBALL (MLB): Minnesota Twins v. Cleveland Indians. Expect at 0500.
For any editorial enquiries please email planning@sntv.com or contact the sportsdesk on +1 212 621 7415 between 0100 and 0600 GMT, or on +44 20 8233 5770 after 0600 GMT.
Last Updated : Sep 29, 2019, 6:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.