ETV Bharat / sports

హిట్​మ్యాన్ రోహిత్ శర్మకు వైస్ కెప్టెన్సీ - Rohit Sharma vice-captain

గాయం నుంచి కోలుకుని జట్టులోకి వచ్చిన స్టార్ ఆటగాడు రోహిత్ శర్మకు వైస్​ కెప్టెన్సీ ఇచ్చారు. ఆసీస్​తో చివరి రెండు టెస్టుల కోసం అతడు బరిలోకి దిగనున్నాడు.

Rohit Sharma appointed vice-captain for last two Tests
హిట్​మ్యాన్ రోహిత్ శర్మకు వైస్ కెప్టెన్సీ
author img

By

Published : Jan 1, 2021, 4:48 PM IST

ఆస్ట్రేలియాతో చివరి రెండు టెస్టులకు రోహిత్ శర్మను వైస్​ కెప్టెన్​గా ఎంపిక చేశారు. దీంతో అతడు మూడో టెస్టు ఆడటం లాంచనమే. జనవరి 7 నుంచి సిడ్నీ వేదికగా ఈ మ్యాచ్​ ప్రారంభం కానుంది.

ఇటీవల 14 రోజుల పాటు క్వారంటైన్​లో ఉన్న హిట్​మ్యాన్.. జట్టుతో బుధవారం కలిశాడు. అనంతరం ప్రాక్టీసులో కూడా పాల్గొన్నాడు. రోహిత్​ రావడం వల్ల జట్టు విజయావకాశాలు పెరగనున్నాయి. పితృత్వ సెలవులపై స్వదేశంలో ఉన్న కోహ్లీ లేని లోటును ఇతడు భర్తీ చేస్తాడని అభిమానులు భావిస్తున్నారు.

Rohit Sharma appointed vice-captain for last two Tests
భారత ఆటగాడు రోహిత్ శర్మ

బాక్సింగ్ డే టెస్టు సందర్భంగా గాయపడిన ఉమేశ్ యాదవ్ స్థానంలో టి.నటరాజన్​ను జట్టులోకి వచ్చాడు. ఈ విషయాన్ని బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది.

జట్టు: రహానె(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), మయాంక్ అగర్వాల్, పృథ్వీషా, కేఎల్ రాహుల్, పుజారా, హనుమ విహారి, శుభ్​మన్ గిల్, సాహా, పంత్, బుమ్రా, నవదీప్ సైనీ, కుల్​దీప్ యాదవ్, జడేజా, అశ్విన్, సిరాజ్, శార్దుల్ ఠాకుర్, నటరాజన్

ఇదీ చదవండి: ఆస్ట్రేలియాతో టెస్టులకు నటరాజన్ ఎంపిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.