టీమ్ఇండియాతో జరుగుతోన్న బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 28 ఓవర్లకు 65/2 పరుగులతో కొనసాగుతోంది. రెండో సెషన్ పూర్తయ్యేసరికి మాథ్యూవేడ్(27), స్టీవ్‌స్మిత్(6) క్రీజులో ఉన్నారు. ఇప్పటివరకు ఉమేశ్, అశ్విన్ చెరో వికెట్ తీశారు. ఆస్ట్రేలియా ఇంకా 66 పరుగుల వెనుకంజలో ఉంది.
రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆదిలోనే కంగారూల ఓపెనర్ జో బర్న్స్(4) ఔటయ్యాడు. ఉమేశ్ బౌలింగ్‌లో అతడు కీపర్ పంత్ చేతికి చిక్కాడు. ఆపై మార్నస్ లబుషేన్(27)ను అశ్విన్ బోల్తా కొట్టించాడు. దీంతో ఆ జట్టు 42 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది. వేడ్, స్మిత్ ఇప్పటివరకు 23 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అంతకుముందు టీమ్‌ఇండియా 326 పరుగులకు ఆలౌటైంది.