ETV Bharat / sports

599 వికెట్లతో జహీర్​ను దాటేసిన అశ్విన్ - narendra modi stadium

భారత స్పిన్నర్​ అశ్విన్​ తాజాగా మరో రికార్డు సృష్టించాడు. ఇంగ్లాండ్​తో జరిగిన మూడో టెస్టులో మూడు వికెట్లు తీసిన యాష్​.. అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక వికెట్లు తీసిన నాలుగో భారత బౌలర్​గా నిలిచాడు. తాజాగా అతడు జహీర్​ ఖాన్​ను అధిగమించాడు.

Ashwin becomes fourth highest wicket-taker for India with 599 international wickets
599 వికెట్లతో జహీర్​ను దాటేసిన అశ్విన్
author img

By

Published : Feb 24, 2021, 10:38 PM IST

భారత ఆఫ్ స్పిన్నర్​ రవిచంద్రన్​ అశ్విన్​ మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక వికెట్లు తీసుకున్న భారత బౌలర్ల జాబితాలో యాష్​.. నాలుగో స్థానంలో నిలిచాడు. తాజాగా అతడు జహీర్ ఖాన్​ను అధిగమించాడు.

నరేంద్ర మోదీ స్టేడియంలో ఇంగ్లాండ్​తో జరిగిన మూడో టెస్టులో మూడు వికెట్లు తీసిన ఈ ఆఫ్ స్పిన్నర్​.. మొత్తం వికెట్ల సంఖ్య 599కి పెంచుకున్నాడు. జహీర్​ 597 వికెట్లతో అశ్విన్​ తర్వాత స్థానంలో ఉన్నాడు. 28వ ఓవర్​లో ఒల్లీ పోప్​ వికెట్​ తీయడం ద్వారా ఈ ఫీట్​ను అందుకున్నాడు యాష్.

ఈ జాబితాలో అనిల్​ కుంబ్లే 953 వికెట్లతో తొలి స్థానంలో ఉన్నాడు. తర్వాతి స్థానాల్లో హర్భజన్​ సింగ్​(707), కపిల్​ దేవ్​(687) ఉన్నారు. సుదీర్ఘ ఫార్మాట్లో అశ్విన్​ మరో మూడు వికెట్లు తీస్తే 400 వికెట్ల క్లబ్​లో చేరుతాడు.

ఇదీ చదవండి: బంతికి ఉమ్ము రుద్దిన స్టోక్స్- శానిటైజ్​ చేసిన అంపైర్లు​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.