ETV Bharat / sports

సచిన్ బ్యాట్​ రిపేర్​ చేసిన వ్యక్తికి కరోనా - latest sports

సచిన్ తెందూల్కర్​ బ్యాట్​ను రిపేర్​ చేసిన వ్యక్తి కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయనకు ఆస్పత్రిలో ప్రత్యేక ఏర్పాట్లు చేసి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.

Ashraf
అష్రఫ్
author img

By

Published : Sep 4, 2020, 7:04 PM IST

సచిన్​ తెందూల్కర్​, విరాట్​ కోహ్లీ వంటి స్టార్​ క్రికెటర్ల బ్యాట్లను రిపేర్​ చేసిన.. బ్యాట్​ మేకర్​ అష్రఫ్​ చౌదరికి కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన సబర్బన్​ అంధేరిలోని సెవెన్​ హిల్స్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అష్రఫ్ పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలిసిన వెంటనే తెందూల్కర్​ ఆస్పత్రి యాజమాన్యాన్ని సంప్రదించి.. అష్రఫ్​ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గదికి మార్పించి చికిత్స అందించాలని కోరారు.

"అష్రఫ్​కు​ చెంబూర్​లోని ఆస్పత్రిలో చేసిన పరీక్షల్లో కరోనా పాజిటివ్​ తేలింది. దీనిపై తెందూల్కర్​ నాతో మాట్లాడారు. అతన్ని సెవెన్​ హిల్స్ ఆస్పత్రికి మార్చి.. ప్రత్యేక సౌకర్యాన్ని కల్పించమని కోరారు. సచిన్​ చెప్పినట్లుగానే చేసి.. అష్రఫ్​ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం."

-డాక్టర్​. భుజంగ్​ పాయ్​, వైద్యుడు

గతంలోనూ అష్రఫ్​ అనారోగ్యం బారిన పడి ఆస్పత్రిలో చేరినప్పుడు.. సచిన్​ ఆయనకు అండగా నిలిచారు. ఆర్థికంగానూ సాయపడ్డారు.

అనేక మంది స్టార్ ఆటగాళ్ల బ్యాట్స్​ను రిపేర్​ చేసిన వ్యక్తి అష్రఫ్​. అంతర్జాతీయ, ఐపీఎల్ మ్యాచ్​ల్లో వాంఖడే స్టేడియంలో ఎప్పుడూ కనిపిస్తుంటారు. అయితే, కరోనా కారణంగా ఆయన వ్యాపారం, ఆరోగ్యం రెండూ దెబ్బతిన్నాయి. ఆస్ట్రేలియా క్రికెటర్​ స్టీవ్ స్మిత్​, వెస్టిండీస్ ఆటగాడు​ క్రిస్​ గేల్​, పొలార్డ్​ వంటి విదేశీ ఆటగాళ్లకూ బ్యాట్​ చేశాడు అష్రఫ్​.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.