ప్రఖ్యాత యాషెస్ మూడో టెస్టుకు రంగం సిద్ధమైంది. లీడ్స్ వేదికగా గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు(భారత కాలమానం ప్రకారం) మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే 1-0తో ఆధిక్యంలో ఉంది ఆస్ట్రేలియా. తొలి టెస్టు ఆసీస్ గెలవగా, రెండో మ్యాచ్ డ్రాగా ముగిసింది.
రెండో టెస్టు మ్యాచ్‌లో ఆర్చర్ వేసిన బౌన్సర్‌కు స్మిత్ గాయపడ్డాడు. అతడు మూడో మ్యాచ్‌కు అందుబాటులో ఉండట్లేదని ఆస్ట్రేలియా జట్టు ప్రకటించింది. ఇప్పుడు స్మిత్ లేని లోటు కంగారూలను కలవరపెట్టే అంశం. ఈ సిరీస్‌లో బ్యాటింగ్‌లో ఆసీస్‌కు వెన్నెముకగా నిలిచిన స్మిత్ లేకుండా ఆస్ట్రేలియా ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.
బ్యాటింగ్‌లో బలహీనంగా ఉన్నా బౌలింగ్‌లో మాత్రం కమిన్స్, హేజిల్‌వుడ్, స్టార్క్ లాంటి మ్యాచ్ విన్నర్లు ఉండటం ఆసీస్‌కు కలిసొచ్చే అంశం.
మరోవైపు ఎలాగైనా సరే గెలవాలనే పట్టుదలతో ఉంది ఇంగ్లాండ్. తొలి మ్యాచ్‌లో ఓటమి అనంతరం పుంజుకున్న రూట్‌సేన.. రెండో టెస్టును డ్రాగా ముగించింది. యువ క్రికెటర్ జోఫ్రా ఆర్చర్ అద్భుతమైన బౌలింగ్ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టింది.
ఇది చదవండి: యాషెస్ : డ్రాగా ముగిసిన రెండో టెస్టు