ETV Bharat / sports

యాషెస్ సిరీస్ డ్రా.. చివరి టెస్టులో ఇంగ్లాండ్ విజయం

లండన్ ఓవల్ వేదికగా జరిగిన యాషెస్ చివరి టెస్టులో ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ 135 పరుగుల తేడాతో విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్​లో ఇంగ్లీష్ బౌలర్లు స్టువర్ట్​ బ్రాడ్, జాక్ లీచ్ చెరో 4 వికెట్లతో ఆకట్టుకున్నారు. ఆసీస్ ఆటగాడు వేడ్(117) శతకంతో రాణించినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు.

యాషెస్
author img

By

Published : Sep 15, 2019, 11:13 PM IST

Updated : Sep 30, 2019, 6:36 PM IST

18 ఏళ్ల విరామం తర్వాత ఇంగ్లాండ్​ గడ్డపై యాషెస్​ సిరీస్ గెలుచుకోవాలన్న ఆస్ట్రేలియా ఆశలు ఆవిరైపోయాయి. లండన్ ఓవల్ వేదికగా జరిగిన చివరి టెస్టులో ఇంగ్లీష్ జట్టు 135 పరుగులు తేడాతో ఘనవిజయం సాధించింది. 399 పరుగులు లక్ష్య ఛేదనలో బరిలో దిగిన కంగారూ జట్టు 263 పరుగుల వద్ద ఆలౌటైంది. ఆసీస్ బ్యాట్స్​మన్ మ్యాథ్యూ వేడ్(117) శతకం చేసినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. రెండో ఇన్నింగ్స్​లో ఇంగ్లాండ్ బౌలర్లు స్టువర్ట్​ బ్రాడ్, జాక్ లీచ్ చెరో 4 వికెట్లతో ఆకట్టుకున్నారు.

ashes series
యాషెస్

తొలి ఇన్నింగ్స్​లో ఆరు వికెట్లతో ఆకట్టుకున్న జోఫ్రా ఆర్చర్​కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఇంగ్లాండ్ తరఫున బెన్​ స్టోక్స్​ మ్యాన్ ఆఫ్ ద సిరీస్​ కైవసం చేసుకున్నాడు. ఆసీస్​ జట్టు నుంచి స్టీవ్ స్మిత్​ ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఈ సిరీస్​లో స్మిత్ ఏడు ఇన్నింగ్స్​లు ఆడిన స్మిత్ 774 పరుగులు చేశాడు.

ఓవర్​ నైట్​ స్కోరు 313 పరుగులతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ మరో 16 పరుగులు చేసి ఆలౌటైంది. అనంతరం 399 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ ఆరంభంలోనే ఓపెనర్ల వికెట్ కోల్పోయింది. ఈ సిరీస్​లో ఇప్పటివరకు ఆదుకున్న స్టీవ్ స్మిత్ తొలి సారి విఫలమవగా.. మిగతా బ్యాట్స్​మన్ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. మ్యాథ్యూ వేడ్ శతకంతో కాసేపు పోరాడినప్పటికీ మరో ఎండ్ నుంచి వేడ్​కు సహకారం లభించలేదు.

ashes series
మ్యాాథ్యూ వేడ్

తొలి ఇన్నింగ్స్​లో మొదట బ్యాటింగ్ చేసిన కంగారూ జట్టు 225 పరుగుల వద్ద ఆలౌటైంది. స్మిత్(80), లబుషేన్(48) మినహా మిగతా వారు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ఇంగ్లీష్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ ఆరు వికెట్లతో సత్తాచాటాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 294 పరుగులు చేసి 69 పరుగుల ఆధిక్యం సాధించింది.

ashes series
యాషెస్

అనంతరం రెండో ఇన్నింగ్స్​లో ఇంగ్లాండ్ 329 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లీష్ బ్యాట్స్​మెన్ జో డెన్లీ(94) త్రుటిలో శతకం చేజార్చుకోగా.. బెన్ స్టోక్స్(67) అర్ధశతకంతో మరోసారి ఆకట్టుకున్నాడు. ఆసీస్ బౌలర్లలో లియోన్ 4 వికెట్లతో సత్తాచాటగా.. పీటర్ సిడిల్, మిచెల్ మార్ష్, కమిన్స్ చెరో రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.

ఇదీ చదవండి: గోల్​ కీపర్​ను బోల్తాకొట్టించి గోల్ కొట్టింది

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Haining City, Zhejiang Province, east China - Sept 13, 2019 (CCTV - No access Chinese mainland)
1. Various of plane flying by moon
An 80x telephoto lens recorded a striking scene of a plane flying past a large full moon at Haining Guanchao Park in east China's Zhejiang province during the Mid-Autumn Festival on Friday night.
The video was shot by the live broadcast team of China Central Television (CCTV) in Yanguan Ancient Town in Haining City.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Sep 30, 2019, 6:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.