యాషెస్ నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా విజయం దిశగా దూసుకువెళ్తోంది. రెండో ఇన్నింగ్స్‌లో 383 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ముందుంచింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లీష్ జట్టు 18 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి పోరాడుతోంది. అంతకు ముందు కంగారూ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్(82) అర్ధశతకంతో మరోసారి ఆదుకున్నాడు. ఫలితంగా 186/6 స్కోరు వద్ద ఆసీస్ డిక్లేర్ ఇచ్చింది. ఇంగ్లాండ్ గెలవాలంటే ఐదో రోజు 365 పరుగులు చేయాలి. చేతిలో 8 వికెట్లు ఉన్నాయి.
-
Australia have declared on 186/6, setting England a target of 383.
— ICC (@ICC) September 7, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Steve Smith was Australia's star once again, hitting 82 from just 92 balls. What a cricketer.
Follow the #Ashes live 👇https://t.co/zrb0K55IBc pic.twitter.com/jgm7EFlfqx
">Australia have declared on 186/6, setting England a target of 383.
— ICC (@ICC) September 7, 2019
Steve Smith was Australia's star once again, hitting 82 from just 92 balls. What a cricketer.
Follow the #Ashes live 👇https://t.co/zrb0K55IBc pic.twitter.com/jgm7EFlfqxAustralia have declared on 186/6, setting England a target of 383.
— ICC (@ICC) September 7, 2019
Steve Smith was Australia's star once again, hitting 82 from just 92 balls. What a cricketer.
Follow the #Ashes live 👇https://t.co/zrb0K55IBc pic.twitter.com/jgm7EFlfqx
ఓవర్ నైట్ స్కోరు 200/5 వద్ద శనివారం బ్యాటింగ్ కొనసాగించిన ఇంగ్లాండ్ మరో వంద పరుగుల చేసి 301 పరుగులకు ఆలౌటైంది. స్టోక్స్(26), బెయిర్ స్టో(17) త్వరగా ఔట్ కావడం వల్ల తక్కువ పరుగులకే పరిమితమైంది. చివర్లో బట్లర్ 41 పరుగులతో పోరాడిన కారణంగా ఇంగ్లాండ్ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది.
అనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆసీస్ 44 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ వరుసగా మూడోసారి డకౌట్ కాగా.. హ్యారిస్(6), మార్నస్ లబుషేన్(11) విఫలమయ్యారు. ఇలాంటి తరుణంలో మరోసారి ఆదుకున్నాడు స్టీవ్ స్మిత్. 92 బంతుల్లో 82 పరుగులు చేసి ఆసీస్‌కు బాసటగా నిలిచాడు. మ్యాథ్యూ వేడ్ 34 పరుగులతో స్మిత్‌కు సహకరించాడు.
తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 497 పరుగుల భారీ స్కోరు చేసింది. స్టీవ్ స్మిత్ డబుల్ సెంచరీతో విజృంభించాడు. లబుషేన్, టిమ్‌పైన్ అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ 3 వికెట్ల, జాక్ లీచ్, క్రేగ్ ఓవర్టన్ చెరో రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.
ఇది చదవండి: ముందస్తు బెయిల్ ప్రయత్నాల్లో షమి