ఓవల్ వేదికగా జరుగుతున్న యాషెస్ ఐదో టెస్టులో తొలిరోజు ఇంగ్లాండ్ తడబడింది. ఆసీస్ బౌలర్ మిచెల్ మార్ష్ విజృంభించడం వల్ల గురువారం ఆటముగిసే సరికి 8 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్.. 27 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు బర్న్స్, రూట్. 103/1తో మెరుగ్గా కనిపించిన ఆ జట్టును ఆస్ట్రేలియా బౌలర్లు ఇబ్బంది పెట్టారు. మార్ష్ 4 వికెట్లు తీశాడు. అతడికి తోడుగా కమిన్స్, హేజిల్‌వుడ్ తలో రెండు వికెట్లు దక్కించుకున్నారు.
ఓ సందర్భంలో 205/7తో కష్టాల్లో ఉన్న ఇంగ్లాండ్‌ను.. బట్లర్ ఆదుకున్నాడు. ఆర్చర్(9), లీచ్ (10 నాటౌట్)తో కలిసి విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు. 64 పరుగులతో ప్రస్తుతం క్రీజులో కొనసాగుతున్నాడీ క్రికెటర్.
ఇప్పటికే 2-1 తేడాతో ఆధిక్యంలో ఉన్న ఆస్ట్రేలియా.. ఎలాగైనా ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ పట్టేయాలని చూస్తోంది. అది జరిగితే దాదాపు 18 ఏళ్ల తర్వాత ఇంగ్లీష్ గడ్డపై యాషెస్ గెలిచిన ఆసీస్ జట్టుగా నిలుస్తుంది.
ఇది చదవండి: కోహ్లీ పోస్ట్.. ధోనీ రిటైర్మెంట్కు సంకేతమా..!