ETV Bharat / sports

రెండో పెళ్లికి సిద్ధమైన అఫ్గాన్​ కెప్టెన్​ - రెండోసారి పెళ్లి అస్గర్​ అఫ్గాన్

తన జీవితంలో సెకండ్​ ఇన్నింగ్స్​ ప్రారంభించబోతున్నాడు అఫ్గాన్​ క్రికెట్​ జట్టు కెప్టెన్​ అస్గర్​ అఫ్గాన్​. త్వరలోనే అతడు మరోసారి పెళ్లి పీటలెక్కనున్నాడు. ఇదివరకే అతనికి వివాహం కాగా.. ఓ కుమారుడు సహా ఐదుగురు పిల్లలు ఉన్నారు.

Asghar Afghan gets engaged for the second time
సెకండ్​ ఇన్నింగ్స్​ ప్రారంభించనున్న అఫ్గాన్​ కెప్టెన్​
author img

By

Published : Nov 13, 2020, 6:55 PM IST

అఫ్గానిస్థాన్​ క్రికెట్​ టీమ్​ కెప్టెన్​ అస్గర్​ అఫ్గాన్ కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి సిద్ధమవుతున్నాడు. రెండోసారి అతడు పెళ్లిపీటలెక్కనున్నాడు. ఈ విషయాన్ని అఫ్గాన్​కు చెందిన సీనియర్​ జర్నలిస్ట్​ ఇబ్రహీమ్​ మోమంద్​ ధ్రువీకరించారు. ట్విట్టర్​ వేదికగా క్రికెటర్​కు శుభాకాంక్షలు తెలిపారు. అస్గర్​కు తన మొదటి భార్య ద్వారా.. ఓ కుమారుడు సహా ఐదుగురు పిల్లలు ఉన్నారు.

  • Afghanistan national captain @MAsgharAfghan got engaged for the second time in his life.
    He has five childrens include a son from his first wife.
    Congratulations 👏🎉❣️ for the second inning skipper. pic.twitter.com/tYFQiDw5vO

    — M.ibrahim Momand (@IbrahimReporter) November 11, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

2015లో అఫ్గానిస్థాన్​ క్రికెట్​ టీమ్​ కెప్టెన్​గా బాధ్యతలు చేపట్టాడు అస్గర్​. అప్పటినుంచి 56 వన్డేలకు నాయకత్వం వహించి.. 36 వన్డేల్లో విజేతగా నిలిపాడు. అతడి సారథ్యంలోని అఫ్గాన్​ జట్టు.. 2018 ఆసియా కప్​ కోసం భారత్​తో పోటీ పడగా ఆ మ్యాచ్​ టైగా ముగిసింది. పలు కారణాల రీత్యా 2019లో జరిగిన ఐసీసీ ప్రపంచ కప్​లో అఫ్గానిస్థాన్​కు గుల్బాదిన్​ నైబ్​ సారథ్యం వహించాడు. కానీ, లీగ్​ దశలో జరిగిన 9 మ్యాచ్​ల్లోనూ అఫ్గాన్​ పరాజయాన్ని మూటగట్టుకుంది.

ఇదీ చదవండి:నేను చూసిన వారిలో కోహ్లీ ది బెస్ట్: ఆస్ట్రేలియా కోచ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.