ETV Bharat / sports

జేబు దొంగతో పోల్చుతూ ధోనీపై ప్రశంసలు - ధోనీపై రవిశాస్త్రి

జేబు దొంగల కంటే ధోనీ వేగంగా పరుగెడతాడని చెప్పిన కోచ్ రవిశాస్త్రి.. క్రికెట్​లో చెరగని ముద్ర వేశాడని చెప్పాడు. దీనితో పాటే రోహిత్ శర్మ కూడా మహీని ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు.

Dhoni was faster than the best pickpockets
ధోనీ
author img

By

Published : Aug 16, 2020, 12:51 PM IST

Updated : Aug 16, 2020, 1:49 PM IST

టీమ్​ఇండియా మాజీ సారథి, వికెట్​ కీపర్ మహేంద్రసింగ్​ ధోనీ.. ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు పలికాడు. ఈ విషయమై స్పందించిన టీమ్​ఇండియా కోచ్​ రవిశాస్త్రి.. మహీ గొప్పతనం గురించి చెబుతూ భావోద్వేగానికి లోనయ్యాడు. జేబుదొంగతనాలు చేసే వారి కన్నా ధోనీ పరుగెడతాడని ప్రశంసించాడు. అన్ని ఫార్మాట్లలోనూ చెరగని ముద్రవేసి, క్రికెట్​ రూపురేఖల్ని మార్చేశాడని అన్నాడు. తన ప్రశాంత స్వభావమే మహీకి ప్రత్యేక గుర్తింపు తెచ్చిందని చెప్పాడు.

ధోనీ.. టీ20ల్లో ప్రపంచకప్​లు సహా ఐపీఎల్​ టైటిల్స్​ను సాధించాడు. వన్డేల్లో ప్రపంచకప్​ను భారత్​కు అందించాడు.​టెస్టు​ల్లోనూ టీమ్​ఇండియాను ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలబెట్టాడు. వికెట్​కీపర్​గా మహీ సరికొత్త ట్రెండ్​ సృష్టించాడు. మొత్తంగా క్రికెట్​ చరిత్రలోనే ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు.

-రవిశాస్త్రి, టీమ్​ఇండియా కోచ్​

గతేడాది వన్డే ప్రపంచకప్​ న్యూజిలాండ్​తో జరిగిన సెమీస్​లో చివరగా కనిపించిన ధోనీ.. అనంతరం ఆటకు తాత్కాలిక విరామం ప్రకటించాడు. అనేక ఊహాగానాల మధ్య ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు పలికాడు.

ప్రభావితం చేసిన వ్యక్తుల్లో మహీ ఒకడు

టీమ్​ఇండియా స్టార్ ఓపెనర్ రోహిత్​ శర్మ కూడా ధోనీపై ప్రశంసలు కురిపించాడు. క్రికెట్​ చరిత్రలోనే ప్రభావితం చేసిన వ్యక్తుల్లో మహీ ఒకడని అన్నాడు. అతడికంటూ ఓ ప్రత్యేక శైలి ఉందని, బలమైన జట్టును రూపొందించే సామర్థ్యం ఉన్న నాయకుడని ప్రశంసించాడు. జాతీయ జట్టులో మిస్​ అయినప్పటికీ ఐపీఎల్​లో తమతోనే ఉంటాడని అన్నాడు. సెప్టెంబరు 19ను ఐపీఎల్​ ప్రారంభ మ్యాచ్​లో కలుద్దాం మహీ అంటూ ట్వీట్ చేశాడు.

  • One of the most influential man in the history of Indian cricket👏His impact in & around cricket was massive. He was a man with vision and a master in knowing how to build a team. Will surely miss him in blue but we have him in yellow.

    See you on 19th at the toss @msdhoni 👍😁 pic.twitter.com/kR0Lt1QdhG

    — Rohit Sharma (@ImRo45) August 16, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

దుబాయ్​ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు ​ బయోసెక్యూర్​ వాతావరణంలో ఐపీఎల్ జరగనుంది. ఆగస్టు 21 యూఏఈకి బయలుదేరనుంది ధోనీ ప్రాతినిథ్యం వహిస్తోన్న సీఎస్కే బృందం. అనంతరం మిగతా జట్లు కూడా వెళ్లనున్నాయి.

Last Updated : Aug 16, 2020, 1:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.