టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆర్మీ అధికారిగా విధులు నిర్వర్తించనున్నాడు. అందులో భాగంగా కశ్మీర్లో పెట్రోలింగ్, గార్డ్ డ్యూటీ చేయనున్నాడని భారత సైన్యం గురువారం స్పష్టం చేసింది.
"లెప్ట్నెంట్ కల్నల్ హోదాలో 106 టీఏ బెటాలియన్(పారా)తో కలిసి జూలై 31 నుంచి ఆగస్టు 15 వరకు పనిచేయనున్నాడు ధోని. ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. సైన్యంతో పాటు ఉంటూ పెట్రోలింగ్, గార్డ్ విధులు నిర్వర్తించనున్నాడు." -భారత సైన్యం
అతడికి లెఫ్ట్‌నెంట్ కల్నల్ హోదాను 2011లోనే ఇచ్చింది భారత సైన్యం. 2015లో పారాట్రూపర్గానూ అర్హత సాధించాడు ధోని. టెర్రిటోరియల్ సైన్యంలో పనిచేసేందుకుగానూ త్వరలో జరిగే వెస్టిండీస్ పర్యటనలో పాల్గొనడం లేదు మహేంద్ర సింగ్ ధోని.
ఇదే కాకుండా చాలా సందర్భాల్లో భారత సైన్యంపై తన అభిమానాన్ని చాటుకున్నాడు మహీ. ఇటీవలే జరిగిన ప్రపంచకప్‌లోనూ గ్లవ్పై మిలటరీ లోగోను ధరించాడు. ఐసీసీ అభ్యంతరం వ్యక్తం చేయడం వల్ల దానిని తొలగించాడు.
ఇది చదవండి: ఆర్మీ శిక్షణ కోసం ధోనికి గ్రీన్ సిగ్నల్