జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా క్రీడాకారులకు అత్యున్నత పురస్కారాలు ప్రదానం చేసింది భారత ప్రభుత్వం. తనకు 'అర్జున' అవార్డు ఇవ్వడంపై టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఆనందం వ్యక్తం చేశాడు. భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపాడు. ఓ వీడియో ద్వారా తన సందేశాన్ని బీసీసీఐ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.
"అర్జున' పురస్కారంతో నన్ను గౌరవించిన భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు. అవార్డులు అందుకున్న ఇతర ఆటగాళ్లకు శుభాకాంక్షలు. వాళ్లకు సంబంధించిన క్రీడల్లో విశేషంగా రాణించారు. నాకు దక్కిన ఈ గౌరవం.. దేశం కోసం అత్యుత్తమ ప్రదర్శన కనబర్చేలా మరింత ప్రేరణనిస్తుంది" -రవీంద్ర జడేజా, భారత క్రికెటర్
-
All-rounder @imjadeja's special message after being conferred with the Arjuna Award 🙏🙏 #TeamIndia pic.twitter.com/6k6jmdDKMv
— BCCI (@BCCI) August 29, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">All-rounder @imjadeja's special message after being conferred with the Arjuna Award 🙏🙏 #TeamIndia pic.twitter.com/6k6jmdDKMv
— BCCI (@BCCI) August 29, 2019All-rounder @imjadeja's special message after being conferred with the Arjuna Award 🙏🙏 #TeamIndia pic.twitter.com/6k6jmdDKMv
— BCCI (@BCCI) August 29, 2019
గురువారం.. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా విశిష్ట పౌర పురస్కారాలను అందుకున్నారు భారత క్రీడాకారులు. వెస్టిండీస్ పర్యటనలో ఉన్న జడ్డూ.. ఈ అవార్డుల ప్రదానోత్సవానికి హాజరు కాలేకపోయాడు.
ఇది చదవండి: "ఆ శతకం చేసిన తర్వాత కళ్లల్లో నీళ్లు తిరిగాయి"