ETV Bharat / sports

సీనియర్లతో సచిన్ తనయుడు.. ఐపీఎల్ వేలానికి అర్హత - sachin latest news

సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో తొలి మ్యాచ్​ ఆడిన అర్జున్ తెందుల్కర్.. ఒక వికెట్ తీసి ఆకట్టుకున్నాడు. దీంతో ఐపీఎల్ వేలానికి అర్హత సాధించాడు.

Arjun Tendulkar makes Mumbai senior team debut
అర్జున్ తెందుల్కర్
author img

By

Published : Jan 15, 2021, 9:56 PM IST

దిగ్గజ క్రికెటర్ సచిన్‌ తెందుల్కర్‌ కుమారుడు అర్జున్‌ తెందుల్కర్‌ ముంబయి సీనియ‌ర్ జ‌ట్టు త‌ర‌పున అరంగేట్రం చేశాడు. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో భాగంగా హరియాణాతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ముంబయి తరపున బరిలోకి దిగాడు.ఈ మ్యాచ్‌లో ముంబయిపై 8 వికెట్ల తేడాతో హరియాణా విజయం సాధించింది.

తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి 143 పరుగులు చేయగా, హరియాణా 17.4 ఓవర్లలో రెండు వికెట్లే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. లెఫ్టార్మ్‌ పేస్ బౌలర్‌ అర్జున్‌ తొలి ఓవర్‌లోనే ఓపెనర్ బిష్ణోయ్‌ వికెట్‌ తీసి ముంబయి సీనియర్‌ జట్టులోకి ఆగమనాన్ని ఘనంగా చాటాడు. మొత్తం మూడు ఓవర్లు వేసిన అర్జున్‌ 34 పరుగులు ఇచ్చాడు. అర్జున్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ముంబయి సీనియర్‌ జట్టుకు ఆడడం వల్ల 21 ఏళ్ల అర్జున్​కు ఐపీఎల్​ వేలంలో పాల్గొనేందుకు అర్హత లభించింది.

ఇవీ చదవండి: సచిన్ పేరు మీద స్టేడియం.. భాజపా ఎంపీ వెల్లడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.