ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్.. భారత క్రికెటర్ కేఎల్ రాహుల్‌కు క్షమాపణలు చెప్పాడు. ఈ విషయాన్ని అతడే ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు. టీమ్ఇండియా-ఆసీస్ తొలి వన్డే సందర్భంగా ఈ ఆసక్తికర విషయం జరిగింది. ఇంతకీ ఏమైందంటే?
ఇటీవల యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్లో పంజాబ్ తరఫున ఆడాడు మ్యాక్స్‌వెల్. అయితే 13 మ్యాచ్‌ల్లో కేవలం 108 పరుగులు మాత్రమే చేశాడు. సీజన్ మొత్తంలో ఒక్క సిక్స్ కూడా కొట్టలేకపోయాడు.
అక్కడి నుంచి నేరుగా స్వదేశానికి చేరుకున్న మ్యాక్స్‌వెల్.. భారత్‌తో శుక్రవారం జరిగిన తొలి వన్డేలో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 19 బంతుల్లో 45 పరుగులు చేశాడు. ఇందులో 3 సిక్సులు, 5 ఫోర్లు ఉన్నాయి.
ఐపీఎల్లో కేఎల్ రాహుల్ నేతృత్వంలో ఆడిన మ్యాక్స్‌వెల్.. అతడు కీపింగ్ చేస్తుండగా, తొలి వన్డేలో ధనాధన్ ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు. దీనిపై సోషల్ మీడియాలో మీమ్స్ వస్తున్నాయి.
వీటిపై స్పందించిన కివీస్ క్రికెటర్ జిమ్మీ నీషన్.. మ్యాక్స్‌వెల్‌ను ట్యాగ్ చేసి ఓ ప్రశ్న ఆడిగాడు. దీంతో "నేను బ్యాటింగ్ చేస్తుండగా అతడికి సారీ చెప్పాను" అని మ్యాక్సీ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది.
-
I apologised to him while I was batting 😂 🦁 🙏 #kxipfriends ❤️
— Glenn Maxwell (@Gmaxi_32) November 28, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">I apologised to him while I was batting 😂 🦁 🙏 #kxipfriends ❤️
— Glenn Maxwell (@Gmaxi_32) November 28, 2020I apologised to him while I was batting 😂 🦁 🙏 #kxipfriends ❤️
— Glenn Maxwell (@Gmaxi_32) November 28, 2020