ETV Bharat / sports

ఐపీఎల్​లో క్రికెటర్లకు డోపింగ్​ టెస్టులు

నాడా.. తొలిసారిగా ఐపీఎల్​లో క్రికెటర్లకు డోపింగ్ టెస్టులు చేయనుంది. ఇప్పటివరకు పరీక్షలు జరిపిన ఇంటర్నేషనల్​ డోప్​ టెస్ట్​ అండ్​ మేనేజ్​మెంట్ సంస్థ​ సహకారం నాడా తీసుకోనుంది. సెప్టెంబరు-నవంబరు మధ్య టోర్నీని నిర్వహించనున్నామని ఇప్పటికే ఐపీఎల్ ఛైర్మన్ వెల్లడించారు.

Anti-Doping measures at IPL 2020: NADA might outsource sample collection
ఐపీఎల్​లో నేరుగా డోపింగ్​ టెస్టులు చేయనున్న నాడా
author img

By

Published : Jul 29, 2020, 9:59 PM IST

యూఏఈ వేదికగా జరగనున్న ఐపీఎల్​లో తొలిసారిగా నేషనల్​ యాంటీ-డోపింగ్​ ఏజెన్సీ(నాడా) ఆటగాళ్లకు డోపింగ్​ పరీక్షలు చేయనుంది. ఇప్పటివరకు జరిగిన సీజన్లలో స్వీడన్​కు చెందిన ఇంటర్నేషనల్​ డోప్​ టెస్ట్​ అండ్​ మెనేజ్​మెంట్​ (ఐడీటీఎమ్​) సంస్థ పరీక్షలు జరిపింది. ప్రస్తుతం సీజన్​కు ఇదే సంస్థ సహకారంతో లేదంటే నాడా సేవలను ఉపయోగించకోనున్నట్లు తెలుస్తోంది.

భారత క్రికెట్​ నియంత్రణ మండలి(బీసీసీఐ).. 2019 మూడో త్రైమాసికం నుంచి నాడా పరిధిలోకి వచ్చింది. ఇందులో భాగంగానే సెప్టెంబరు 19 నుంచి నవంబరు 8 వరకు జరగనున్న ఐపీఎల్​లో ఈ ఏజెన్సీనే ఆటగాళ్ల నమూనాలు సేకరించనుంది.

ఖర్చులు వాళ్లే భరించాలి

"ఐపీఎల్​ పూర్తి షెడ్యూల్​ వచ్చే వారం ప్రకటిస్తాం. ఆ ప్రణాళికను నాడాకు పంపిన తర్వాత స్వయంగా వారే రావాల్సి ఉంటుంది. ఎందుకంటే నమూనాల సేకరణకు అయ్యే రవాణా ఖర్చులను వారే భరించాల్సి ఉంటుంది" అని బీసీసీఐకి చెందిన ఓ సీనియర్​ అధికారి వెల్లడించారు. 2019 ఐపీఎల్​ సీజన్​ వరకు ప్రపంచ యాంటీ డోపింగ్​ ఏజెన్సీ ఆమోదించిన ఐడీటీఎమ్​ ఇన్​ఛార్జ్​ నమూనా సేకరణలకు అయ్యే ఖర్చును బీసీసీఐ భరించేది.

దోహాకు నమూనాలు

నాడా నమూనాలను సేకరించి దోహాలోని ప్రయోగశాల వాడాకు రవాణా చేయడం అత్యంత ఖర్చుతో కూడుకున్నది. నేషనల్​ డోప్​ టెస్టింగ్​ లాబొరేటరీ (ఎన్​డీటీఎల్​)ను వాడా సస్పెండ్​ చేసినప్పటి నుంచి నాడా సేకరించిన నమూనాలను ఈ ల్యాబ్​కు పంపుతుంది.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.