ETV Bharat / sports

భారత మహిళా క్రికెట్లో పట్టుబడ్డ తొలి డోపీ - డోపింగ్​ పరీక్షలో మహిళా క్రికెటర్​ విఫలం

మధ్యప్రదేశ్​ ఆల్​రౌండర్​ అన్షులారావు.. నిషేధిత ఉత్పేరకాలు తీసుకున్నట్లు డోప్​ పరీక్షల్లో నిర్ధరణ అయింది. దీంతో డోపింగ్​కు పాల్పడిన భారత తొలి మహిళా క్రికెటర్​గా నిలిచింది. తనపై రెండేళ్ల నుంచి నాలుగేళ్ల వరకు నిషేధం విధించే అవకాశముంది.

Anshula Rao
అన్షులారావు
author img

By

Published : Aug 13, 2020, 8:21 AM IST

మధ్యప్రదేశ్ ఆల్ రౌండర్ అన్షులారావు డోప్ పరీక్షల్లో విఫలమైంది. నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకుని, డోప్ పరీక్షల్లో దొరికిన భారత తొలి మహిళా క్రికెటర్ ఈమెనే. నిరుడు ఆగస్టులో బీసీసీఐ .. జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ ( నాడా ) పరిధిలోకి వచ్చాక డోపింగ్ లో పట్టుబడిన తొలి భారత క్రికెటర్ కూడా ఈమెనే.

Anshula Rao
అన్షులారావు

టీమ్ ఇండియా ఓపెనర్ పృథ్వీషా.. గతేడాది జూన్​లో డోప్ పరీక్షల్లో విఫలమైనప్పుడు బీసీసీఐ నాడా పరిధిలోకి లేదు. నాడాకు ముందు బీసీసీఐ క్రికెటర్ల నమూనాల సేకరణ , పరీక్షల్ని స్వీడెన్‌కు చెందిన అంతర్జాతీయ డోపింగ్ పరీక్షలు , నిర్వహణ ( ఐడీటీఎం ) సంస్థ చూసుకుంది. ఐడీటీఎం పరీక్షల అనంతరమే ప్రదీప్ సాంగ్వాన్ , యూసుఫ్ పఠాన్ నిషేధానికి గురయ్యారు. ఈ ఏడాది మార్చి 11న బరోడాలో అన్షులా మూత్రం నమూనాల్ని నాడా సేకరించింది . ఈ నమూనాల్ని ఖతార్‌లోని దోహా ప్రయోగశాలకు పంపించగా, అన్షులా నిషేదిత ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలింది. తొలిసారిగా డోపింగ్​కు పాల్పడిన ఈమెపై రెండు నుంచి నాలుగేళ్ల వరకు నిషేధం విధించే అవకాశముంది.

ఇది చూడండి టీ20 ప్రపంచకప్​ భారత్​లో జరగకపోతే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.