ETV Bharat / sports

‘నా రికార్డు కోసం శ్రీనాథ్ అలా చేశాడు’ - అనిల్ కుంబ్లే 10 వికెట్లు

తాను తొలుత ఇంజినీర్ కావాలనుకున్నానని తెలిపాడు టీమ్​ఇండియా మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే. 13 ఏళ్ల వయసులో మీడియం పేసర్​గా ఉండేవాడినని.. కానీ తర్వాత స్పిన్ బౌలర్​గా మారినట్లు వెల్లడించాడు. జింబాబ్వే ఆటగాడు పామీ బంగ్వాతో ఇన్​స్టా చాట్​లో మాట్లాడిన కుంబ్లే పలు విషయాలు పంచుకున్నాడు.

‘నా రికార్డు కోసం శ్రీనాథ్ అలా చేశాడు’
‘నా రికార్డు కోసం శ్రీనాథ్ అలా చేశాడు’
author img

By

Published : Jul 25, 2020, 5:32 AM IST

తాను తొలుత ఇంజినీర్‌ అవ్వాలనుకున్నానని టీమ్‌ఇండియా మాజీ కోచ్‌, స్పిన్‌ దిగ్గజం అనిల్‌ కుంబ్లే చెప్పాడు. తాజాగా జింబాబ్వే ఆటగాడు పామీ బంగ్వాతో ఇన్‌స్టాగ్రామ్‌ చాట్‌లో మాట్లాడిన కుంబ్లే తన గురించి, కెరీర్‌ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. తాను చిన్నప్పుడు బెంగళూరు వీధుల్లో క్రికెట్‌ ఆడేవాడినని, ఇప్పుడా పరిస్థితి లేదన్నాడు. అలాగే 13 ఏళ్ల వయసులో తాను మీడియం పేసర్‌గా ఉండేవాడినని ఓ క్లబ్‌లో చేరాక సీనియర్లు తన బౌలింగ్‌ యాక్షన్‌ నచ్చక బంతులేయనిచ్చేవారు కాదన్నాడు. ఈ క్రమంలోనే తాను స్పిన్‌ బౌలింగ్‌ వైపు మళ్లినట్లు వివరించాడు.

‘నా రికార్డు కోసం శ్రీనాథ్ అలా చేశాడు’
‘నా రికార్డు కోసం శ్రీనాథ్ అలా చేశాడు’

“నాకు మొదట లెగ్‌స్పిన్‌ ఎలా వేయాలో తెలిసేది కాదు. కేవలం చేతిని యాంటీ క్లాక్‌వైజ్‌గా మాత్రమే తిప్పడం తెలుసు. ఆ తర్వాత కొద్ది నెలలకే అండర్‌-15 స్థాయిలో కర్ణాటక తరఫున ఆడే అవకాశం దక్కింది. ఆపై వెనుతిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి రాలేదు. ప్లాన్‌ ఏ ప్రకారం తొలుత ఇంజినీరింగ్‌ చేయాలనుకున్నా. ప్లాన్‌ బీగా క్రికెటర్‌ అవ్వాలనుకున్నా. అయితే ఇంజినీరింగ్‌ పూర్తయ్యేసరికి క్రికెటర్‌గా మారాలనుకున్నా.”

-కుంబ్లే, టీమ్​ఇండియా మాజీ క్రికెటర్

అనంతరం 1999లో పాకిస్థాన్‌తో ఆడిన రెండు టెస్టుల సిరీస్‌పై కుంబ్లే స్పందిస్తూ.. అది నిన్ననే జరిగినట్లు అనిపిస్తుందన్నాడు. చెన్నైలో తొలి టెస్టు ఓటమిపాలయ్యాక దిల్లీలోని కోట్లా మైదానంలో రెండో టెస్టు ఆడినట్లు పేర్కొన్నాడు. కాగా, అప్పుడు తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కుంబ్లే రెండో ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. ఆ మ్యాచ్‌ తనకెంతో ప్రత్యేకమని పేర్కొన్నాడు. తాను 9 వికెట్లు తీశాక శ్రీనాథ్‌ ఒక ఓవర్‌ బౌలింగ్‌ చేయాల్సి వచ్చిందని, అప్పుడతను బౌలింగ్‌ చేయడానికి చాలా ఇబ్బంది పడినట్లు చెప్పాడు. పదో వికెట్‌ కూడా తనకు దక్కడం కోసమే శ్రీనాథ్‌ ఆ ఓవర్‌లో వైడ్లు వేశాడని గుర్తుచేసుకున్నాడు. చివరికి తన బౌలింగ్‌లోనే వసీం అక్రమ్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌కు క్యాచ్‌ ఇవ్వడం వల్ల పది వికెట్లు దక్కాయన్నాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.