ETV Bharat / sports

'అక్షర్‌.. నీ కళ్లద్దాలు ఎక్కడ దొరుకుతాయ్‌' - భారత్Xఇంగ్లాండ్

ఇంగ్లాండ్​తో జరిగిన టెస్ట్ సిరీస్​లో భారత్​ విజయం సాధించిన నేపథ్యంలో ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర ఫన్నీ ట్వీట్ చేశారు. టీమ్​ విజయాన్ని ఆనందించేందుకు ఆయనకు అక్షర్​ లాంటి కళ్లద్దాలు కావాలని అన్నారు.

Anand Mahindra wants sunglasses worn by Axar Patel
'అక్షర్‌.. నీ కళ్లద్దాలు ఎక్కడ దొరుకుతాయ్‌'
author img

By

Published : Mar 6, 2021, 7:20 PM IST

Updated : Mar 6, 2021, 7:51 PM IST

సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా.. వర్తమాన వ్యవహారాలపై ఎప్పటికప్పుడు తనదైన శైలిలో స్పందిస్తుంటారు. తాజాగా ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్‌ సిరీస్‌లో టీమిండియా ఘన విజయం సాధించడంపై అభినందనలు తెలిపిన ఆయన.. ఓ ఆసక్తికర ట్వీట్‌ చేశారు. మ్యాచ్‌లో స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ పెట్టుకున్న సన్‌ గ్లాసెస్‌ చూసి ముచ్చటపడిన మహీంద్రా.. అవి ఎక్కడ దొరుకుతాయో చెప్పాలని కోరారు.

"ఓకే.. దుమ్ములేపారు. సిరీస్‌ను జేబులో వేసుకున్నారు. అభినందనలు. ఇప్పుడు ఈ విజయాన్ని సెలబ్రేట్‌ చేసుకునేందుకు నాకు ఈ చలువ కళ్లద్దాలు(అక్షర్‌ పెట్టుకున్నవి) కావాలి. అవి ఏ బ్రాండ్‌? ఎక్కడ దొరుకుతాయ్‌?"అని మహీంద్రా ట్వీట్‌ చేశారు.

ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ తేడాతో గెలిచి 3-1తో టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకోవడమేగాక, ఐసీసీ టెస్టు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు అర్హత సాధించింది. ఇక ఈ మ్యాచ్‌లో అక్షర్‌ మరోసారి ఐదు వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు అహ్మదాబాద్‌లో జరిగిన మూడో టెస్టులో 11 వికెట్లు పడగొట్టి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

ఇదీ చదవండి:టీమ్​ఇండియా విజయంపై ప్రముఖులు, మాజీల ప్రశంసలు

Last Updated : Mar 6, 2021, 7:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.