పాకిస్థాన్ సూపర్‌లీగ్ (పీఎస్ఎల్)లో విజేతగా నిలిచిన కరాచీ కింగ్స్ ఆటగాళ్లకు ఫ్రాంచైజీ యజమాని బహుమతులను ప్రకటించారు. జట్టులోని ప్రతి ఆటగాడికి ఓ ఫ్లాట్ ఇవ్వనున్నట్లు చెప్పారు. తన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులోని ఓ అపార్ట్‌మెంట్‌ను పూర్తిగా క్రికెటర్లుకు కేటాయిస్తున్నట్లు పాకిస్థాన్ జర్నలిస్టు ఒమర్ ఆర్ ఖురేషి వెల్లడించారు.
పీఎస్ఎల్ ఫైనల్లో గెలిచిన తర్వాత కరాచీ కింగ్స్ కెప్టెన్ ఇమాద్ వసీమ్.. దివంగత కోచ్ డీన్ జోన్స్ తమ జట్టు కృషిని మెచ్చుకున్నాడు. "డీన్ జోన్స్‌కు ఈ క్రెడిట్ దక్కుతుంది. ఎందుకంటే ఆయన మాకు చాలా విషయాలను నేర్పించారు. ప్రపంచంలో చాలా తక్కువ మంది కోచ్‌లు అలా చేయగలరు" అని ఇమాద్ తెలిపారు.
మార్చిలో కరోనా ప్రభావంతో పాకిస్థాన్ సూపర్‌లీగ్ ప్లేఆఫ్స్ తర్వాత నిలిచిపోయింది. ఇటీవల నాకౌట్ మ్యాచ్‌లతో పాటు ఫైనల్ కూడా నిర్వహించారు. అందులో కరాచీ కింగ్స్ విజేతగా నిలిచింది.