సినిమాలు, వెబ్ సిరీస్లు మాత్రమే చూసే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇకపై లైవ్ క్రికెట్ కూడా చూడొచ్చు. ఈ విషయాన్ని సదరు సంస్థ మంగళవారం వెల్లడించింది.
న్యూజిలాండ్ బోర్డుతో ఒప్పందం కుదుర్చుకున్న ఈ సంస్థ.. రానున్న ఆరేళ్ల పాటు(2020 నుంచి 2026 వరకు) ఆ దేశంలో జరిగే అన్ని ఫార్మాట్ల మ్యాచ్లను యాప్లో లైవ్ ప్రసారం చేయనుంది అమెజాన్. 2022 ప్రారంభంలో భారత్తో జరిగే సిరీస్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.
ఆస్ట్రేలియా పర్యటనకు సిద్ధమైన టీమ్ఇండియా.. నవంబరు 27 నుంచి కంగారూ దేశంలో వన్డే, టీ20, టెస్టులు ఆడనుంది.
ఇది చదవండి: టీవీలోనూ క్రికెట్ చూడని అమ్మాయి.. మినీ ఐపీఎల్లో