ETV Bharat / sports

'ఖాళీ సమయాల్లో ఆ ఇన్నింగ్స్​ హైలైట్స్​ చూస్తా'

క్రికెట్​లో తనకు నచ్చిన మూడు ఇన్నింగ్స్​ల గురించి ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు మాస్టర్​ బ్లాస్టర్​ సచిన్ తెందుల్కర్​. తన కెరీర్​లోని ఈ మూడు ఇన్నింగ్స్​లను ఎన్ని సార్లు చూసినా సంతోషంగానే ఉంటుందని తెలిపాడు.

Always enjoy watching them: Sachin Tendulkar picks three innings from his career he likes watching highlights of
'ఖాళీ సమయాల్లో ఆ ఇన్నింగ్స్​ హైలైట్స్​ చూస్తా'
author img

By

Published : Dec 10, 2020, 7:49 PM IST

క్రికెట్​లో 100 అంతర్జాతీయ సెంచరీలు నమోదు చేసి.. 34 వేలకు పైగా పరుగులు చేసిన సుదీర్ఘ ప్రయాణంలో ఉత్తమ ఇన్నింగ్స్​ ఎంపికచేయడమంటే కష్టమైన పనే. కానీ, తన కెరీర్​లో ఉత్తమమైన ఇన్నింగ్స్​ను ఎంచుకోవడం సులభమని అంటున్నాడు మాస్టర్​ బ్లాస్టర్​ సచిన్​ తెందుల్కర్​. తన క్రికెట్ కెరీర్​లోని మూడు ఇన్నింగ్స్​ను మళ్లీ మళ్లీ చూడటానికి వెనుకాడనని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

"1998లో షార్జా వేదికగా ఆస్ట్రేలియాతో వరుసగా సెమీఫైనల్​, ఫైనల్​ రెండు మ్యాచ్​లు ఆడాల్సివచ్చింది. ఫైనల్​కు చేరుకోవడానికి సెమీస్​లో​ తప్పనిసరిగా గెలవాలి. కానీ, అందులో ఓడినా చివరికి ఫైనల్​ చేరాం. ఆ తర్వాత ప్రపంచకప్​-2003లో పాకిస్థాన్​తో ఆడిన మ్యాచ్​ను చూడటం ఎప్పటికీ ఇష్టమే. అంతకుముందే 1989లో పాకిస్థాన్​ పర్యటనకు నవంబరు-డిసెంబరులో వెళ్లాం. అప్పటికి నా వయసు 16 ఏళ్లు. అంతర్జాతీయ కెరీర్​లో అది నా మొదటి పర్యటన. అక్కడ కొన్ని ప్రాంతాలు శీతలంగా ఉన్నాయి. ఉష్ణోగ్రత పడిపోయినా.. మా ఆటతీరుతో వెచ్చని విజయం పొందాం. నేను ఇంటికి తిరిగి వచ్చినప్పుడు.. నా ఆటతీరుపై కుటుంబసభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేశారు".

- సచిన్​ తెందుల్కర్​, దిగ్గజ క్రికెటర్​

షార్జా వేదికగా 1998లో జరిగిన కోకా కోలా కప్​లో టీమ్​ఇండియా విజయం సాధించింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, భారత్​ మధ్య జరిగిన సిరీస్​లో ఒక్క మ్యాచే​ గెలిచినా ఎక్కువ రన్​రేట్​ కారణంగా ఫైనల్​కు చేరి ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. ఆస్ట్రేలియా లీగ్​ దశలో 4 మ్యాచ్​లు గెలవడం గమనార్హం.

ఇందులో సచిన్​ తెందుల్కర్​ ఇన్నింగ్స్​ కీలకం. ఫైనల్​కు ముందు కీలక మ్యాచ్​లో 143 పరుగులు చేసిన మాస్టర్​.. అదే జట్టుపై ఫైనల్​లో 134 రన్స్​ చేసి టీమ్​ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. సచిన్​ ఇన్నింగ్స్​ను 'ఎడారిలో పరుగుల తుపాను'గా అభిమానులు వర్ణిస్తారు.

ప్రపంచకప్​-2003లో పాకిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో సచిన్​ 98 పరుగులు చేసి జట్టు విజయానికి సహకరించాడు. అలాగే 1989లో అదే జట్టుపై జరిగిన టెస్టు సిరీస్​లోనూ మాస్టర్​ పరుగుల వరద పారించాడు. ఆ విధంగా కెరీర్​లో తనకు ఇష్టమైన మూడు ఇన్నింగ్స్​ సందర్భాలను సచిన్​ గుర్తు చేసుకున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.