కరోనా వైరస్ కారణంగా రెండుసార్లు వాయిదా పడిన లంక ప్రీమియర్ లీగ్(ఎల్‌పీఎల్).. ఎట్టకేలకు వచ్చే నెలలో ప్రారంభం కానుంది. ఈ లీగ్‌లో మొత్తం ఐదు జట్లు పోటీపడనున్నాయి. ఇందులోని ఓ ఫ్రాంచైజీని బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సోదరుడు సోహైల్ ఖాన్ కొనుగోలు చేశారు. క్యాండీ టస్కర్స్ జట్టును సొంతం చేసుకున్నట్లు సోహైల్ వెల్లడించారు.
![Salman](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9261920_128_9261920_1603288151994.png)
శ్రీలంక క్రికెటర్లు కుశాల్ పెరెరా, కుశాల్ మెండిస్, అసెల గుణరత్నేలతో పాటు వాహబ్ రియాజ్, క్రిస్ గేల్, లియమ్ ప్లంకెట్ వంటి విదేశీ ఆటగాళ్లు తమ జట్టులో ఉన్నారని సోహైల్ పేర్కొన్నారు. లీగ్‌లో విదేశీ ఆటగాళ్లు ఉండటంపై సోహైల్ సంతోషం వ్యక్తం చేస్తూ.. యువ, అనుభవజ్ఞులతో జట్టు సమతూకంగా ఉందని అన్నారు.
కరోనా వల్ల నవంబర్ 14 నుంచి డిసెంబర్ 13వ తేదీ వరకూ ఖాళీ స్డేడియాల్లోనే ఈ లీగ్‌ను నిర్వహించనున్నారు.
ఇదీ చూడండి గేల్ ఓ దెయ్యం.. రెండు కాళ్లు కట్టేయాలి!