ETV Bharat / sports

ధోనీ తర్వాత వికెట్​ కీపర్ స్థానం ఎవరిది?

మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ చెప్పేశాడు. అయితే అతడి వికెట్ కీపర్​ స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలనేది ప్రస్తుతం చాలామందికి వస్తున్న ప్రశ్న. ఈ విషయమై పలువురు భారత మాజీ క్రికెటర్లు ఏం చెప్పారంటే?

ధోనీ తర్వాత వికెట్​ కీపర్ స్థానం ఎవరిది?
మహేంద్ర సింగ్ ధోనీ
author img

By

Published : Aug 17, 2020, 7:07 AM IST

ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పడం వల్ల.. వన్డే, టీ20ల్లో కేఎల్‌ రాహులే ఇక తొలి ప్రాధాన్యమని మాజీ వికెట్‌కీపర్లు దినేశ్ మోంగియా, ఎమ్మెస్కే ప్రసాద్‌ అభిప్రాయపడ్డారు.

  1. "50 ఓవర్ల ఫార్మాట్‌కు కేఎల్‌ రాహులే తొలి ప్రాధాన్యం. బ్యాటింగ్‌ను పక్కనపెడితే కీపింగ్‌లోనూ సత్తా చాటుతున్నాడు. వన్డేల్లో కీపింగ్‌ చేయడం మొదలుపెట్టిన నాటి నుంచి తన బ్యాటింగ్‌ కూడా మెరుగుపడింది. ఫామ్‌ను బట్టి కేఎల్‌కు తొలి అవకాశం ఇవ్వాలి.. తర్వాత పంత్‌కే ఛాన్స్‌" -నయన్‌ మోంగియా, భారత మాజీ క్రికెటర్
    kl rahul-rishab pant
    కేఎల్ రాహుల్-రిషభ్ పంత్
  2. "భారత జట్టు చివరిగా ఆడిన న్యూజిలాండ్‌ సిరీస్‌లో రాహుల్‌కే మొదటి ప్రాధాన్యం దక్కింది. అవకాశాలను అతడు సద్వినియోగం చేసుకున్నాడు. కరోనా తర్వాత విరామం రావడం వల్ల ఇప్పుడు ఐపీఎల్‌లో ఎవరు ఎలా ఆడతారో చూడాలి. ధోనీ వదిలిన బాధ్యతలను స్వీకరిస్తున్నప్పుడు ఒత్తిడిని కూడా ఎదుర్కోవాలి" -ఎమ్మెస్కే ప్రసాద్, బీసీసీఐ సెలక్టర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.