ప్రస్తుతం పరిస్థితులు కాస్త కష్టంగానే ఉన్నా త్వరగానే అలవాటు పడొచ్చని ముంబయి ఇండియన్స్ బౌలింగ్ కోచ్ జహీర్ ఖాన్ అన్నాడు. కరోనా ముప్పు నేపథ్యంలో ఇవన్నీ తప్పవని పేర్కొన్నాడు. తమ జట్టు ఆటగాళ్లు కొత్త పద్ధతులకు వేగంగానే అలవాటు పడుతున్నారని వెల్లడించాడు.
"ఇవన్నీ కష్టంగా లేవని అనను. కానీ కొద్ది సమయంలోనే అలవాటు పడొచ్చు. సన్నాహక పద్ధతులు మారాయి. వాటిని మనం అనుసరించక తప్పదు. ఏదేమైనప్పటికీ మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టడం ఆనందంగా ఉంది. బంతిపై ఉమ్మి రాయకుండా ఉండేందుకు మేం జాగ్రత్తగా ఉంటున్నాం. ఐతే పాత అలవాటు మాత్రం బౌలర్లను వేధిస్తుంటాయి. వాటిపై దృష్టిపెట్టాలి."
-జహీర్ ఖాన్, ముంబయి ఇండియన్స్ బౌలింగ్ కోచ్
ముంబయి ఇండియన్స్.. ఆటగాళ్లందరికీ జిప్‌తో కూడిన ఒక సంచీ ఇచ్చింది. ఎందుకంటే సాధనకు ఉపయోగించిన బంతులన్నీ ఎవరి సంచిలో వారే వేసుకోవాలి. తిరిగి వాటినే ఉపయోగించాలి. క్షేమంగా ఉండటం కోసమే ఇలా చేస్తున్నామని జహీర్ చెప్పాడు. క్రికెటర్లందరూ ప్రత్యేకమైన మానసిక స్థితిని అలవరుచుకోవాలని సూచించాడు. మనసును నియంత్రించేందుకు లాక్‌డౌన్ ఉపయోగపడిందని పేర్కొన్నాడు. ఒక్కో ఆటగాడి మానసిక పరిస్థితి ఒక్కోలా ఉంటుందని వివరించాడు.
ఐపీఎల్ 2020 ఆరంభ మ్యాచులో రన్నరప్ చెన్నై సూపర్‌కింగ్స్‌తో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్ తలపడునుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">