మిస్టర్ 360 అని అభిమానులు ముద్దుగా పిలిచుకునే ఏబీ డివిలియర్స్ గురించి క్రికెట్ ప్రేమికులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2018లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఇతడు.. ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌తో రీఎంట్రీ ఇచ్చే అవకాశముంది. ఇదే విషయంపై మాట్లాడిన మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ ఆనందం వ్యక్తం చేశాడు. ఏబీ రాకతో జట్టు బలపడుతుందన్నాడు.
"డివిలియర్స్ వస్తే జట్టు బలపడుతుంది. అతడి రాకతో ప్రత్యర్థులకు కష్టమే. ఏబీ చాలా ప్రత్యేకమైన ఆటగాడని మీకు(దక్షిణాఫ్రికా బోర్డు) తెలుసు. ఒకవేళ అతడ్ని ఈ దేశం తరఫున ఆడించకపోతే, అలాంటి వ్యక్తిని మీరు చూపిస్తారా?"
-జాంటీ రోడ్స్, మాజీ క్రికెటర్
ఐసీసీ టోర్నీల్లో ఇప్పటివరకు దక్షిణాఫ్రికా కప్పు గెలవలేదు. కీలక ఆటగాళ్లు ఉన్నప్పటికీ దశాబ్దాలుగా కనీసం ఒక్క ట్రోఫీనైనా దక్కించుకోలేకపోయింది. గతేడాది వన్డే ప్రపంచకప్‌లో మరీ దారుణంగా ఆడింది. 3 విజయాలు, 5 ఓటములతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది.