ETV Bharat / sports

ఐపీఎల్: డివిలియర్స్​ నెట్ ప్రాక్టీస్ షురూ - AB Devillers latest news

రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు ఆటగాడు ఏబీ డివిలియర్స్​ ప్రాక్టీసు కోసం నెట్స్​లో అడుగుపెట్టాడు. సెషన్​ ముగింపులో తనదైన ట్రేడ్​మార్క్​ షాట్లతో అలరించాడు. చాలా నెలల తర్వాత బ్యాట్​ పట్టుకోవడం మంచి అనుభూతినిచ్చిందని వెల్లడించాడు.

AB de Villiers hits the nets for the first time,
నెట్​ ప్రాక్టీసులో అడుగుపెట్టిన మిస్టర్​ 360
author img

By

Published : Aug 31, 2020, 12:40 PM IST

ఐపీఎల్​ 13వ సీజన్​ కోసం యూఏఈ చేరుకున్న రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు ఫ్రాంచైజీ ఆటగాళ్లకు ఇటీవలే శిబిరాన్ని ప్రారంభించింది. ఇందులోని స్టార్​ ఆటగాడు ఏబీ డివిలియర్స్​ తొలిసారి నెట్స్​లో ప్రాక్టీసు మొదలుపెట్టాడు. సెషన్​ ముగింపులో తన ట్రేడ్​మార్క్​ షాట్లతో అలరించాడీ మిస్టర్ 360​.

ఆర్సీబీ యూట్యూబ్​ ఛానెల్​లో అప్​లోడ్​ చేసిన 'బోల్డ్ డైరీస్' ఎపిసోడ్​లో.. డివిలియర్స్​, పార్థివ్​ పటేల్​, శివం దూబే వంటి ఆటగాళ్లు తమ ప్రాక్టీసును తీవ్రతరం చేసినట్లు తెలుస్తోంది. నెట్​ ప్రాక్టీస్ పూర్తి చేసిన తర్వాత ఓ చిన్న ఇంటర్వ్యూ ఇచ్చాడు డివిలియర్స్​. చాలా కాలం తర్వాత బ్యాట్​ పట్టినందుకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపాడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

"ఇది చాలా బాగుంది. ఇక్కడ ప్రాక్టీసు చేయడం చాలా ఆనందంగా ఉంది. కానీ లైట్లు కొంచెం అస్పష్టంగా ఉన్నాయి. వికెట్​ కొంచెం జిడ్డుగా ఉంది. కాబట్టి ఇది చాలా పెద్ద సవాలు. తొలుత నేను బంతిని చాలా జాగ్రత్తగా చూడాల్సి వచ్చింది. చివర్లో మాత్రం కొన్ని మంచి షాట్లు ఆడా. అది కూడా ఆనందించే విషయమే. ప్రాక్టీసులో మనం తీవ్రంగా శ్రమించాలి. అదే నేనూ చేస్తా."

-ఏబీ డివిలియర్స్​, ఆర్సీబీ బ్యాట్స్​మన్​

ఏబీ డివిలియర్స్​ చాలా కాలంగా ఆర్సీబీ బ్యాటింగ్​ లైనప్​లో నిలకడగా రాణిస్తున్నాడు. ప్రస్తుత ఈ లీగ్​ సీజన్​లో అతడిపై చాలా బాధ్యత ఉంటుంది.

టీ20 ప్రపంచకప్​ కోసం డివిలియర్స్ దక్షిణాఫ్రికా జట్టులోకి తిరిగి వస్తున్నట్లు చర్చలు జరిగాయి. కానీ, టోర్నీ వాయిదా వేయడం వల్ల ఆ విషయంపై ఎలాంటి స్పష్టత రాలేదు. అయితే ఐపీఎల్​ 13వ సీజన్​లో ఆర్సీబీ కోసం వికెట్​ కీపర్​గా మారాలని నిర్ణయించుకున్నాడు డివిలియర్స్​.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.