ఆఖరి టీ-20లోనూ వెస్టిండీస్‌కు నిరాశే ఎదురైంది. 3 మ్యాచ్‌ల టీ-20 సిరీస్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. మంగళవారం గయానా వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. వెస్టిండీస్ నిర్దేశించిన 147 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 19.1 ఓవర్లలోనే ఛేదించింది కోహ్లీ సేన. రిషభ్ పంత్(65 నాటౌట్; 42 బంతుల్లో), విరాట్ కోహ్లీ(52; 45 బంతుల్లో) అర్ధశతకాలతో రాణించారు. దీపక్ చాహర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. సిరీస్ మొత్తం ఆల్‌రౌండ్ ప్రతిభ కనబర్చిన కృనాల్ పాండ్యకు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ దక్కింది.
పొలార్డ్ ఒక్కడే...
తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి.. 146 పరుగులు చేసింది. తొలుత 14 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన కరేబియన్ జట్టును పొలార్డ్(58; 45 బంతుల్లో) ఆదుకున్నాడు. నాలుగో వికెట్‌కు పూరన్‌తో కలిసి 66 పరుగులు జోడించి.. ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు. చివర్లో పావెల్(20 బంతుల్లో 32) మెరుపులు మెరిపించగా ఆ మాత్రం స్కోరైనా సాధించింది.
-
That's the end of the West Indies innings – they finish on 146/6.
— ICC (@ICC) August 6, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Kieron Pollard top-scored with 58 and for India, Deepak Chahar was exceptional, returning figures of 3/4 from three overs!#WIvIND LIVE 👇https://t.co/BLwOeTRm5h pic.twitter.com/7cOtbywqzN
">That's the end of the West Indies innings – they finish on 146/6.
— ICC (@ICC) August 6, 2019
Kieron Pollard top-scored with 58 and for India, Deepak Chahar was exceptional, returning figures of 3/4 from three overs!#WIvIND LIVE 👇https://t.co/BLwOeTRm5h pic.twitter.com/7cOtbywqzNThat's the end of the West Indies innings – they finish on 146/6.
— ICC (@ICC) August 6, 2019
Kieron Pollard top-scored with 58 and for India, Deepak Chahar was exceptional, returning figures of 3/4 from three overs!#WIvIND LIVE 👇https://t.co/BLwOeTRm5h pic.twitter.com/7cOtbywqzN
భారత బౌలర్లలో దీపక్ చాహర్ 3, సైనీ 2 వికెట్లు తీశారు. రాహుల్ చాహర్‌కు ఓ వికెట్ దక్కింది.
ఛేదనలో అలవోకగా...
-
A 3-0 series win for India!
— ICC (@ICC) August 6, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Rishabh Pant finishes unbeaten on 65 as India win by seven wickets. With the ball it was Deepak Chahar who impressed, taking 3/4. #WIvIND SCORECARD 👇https://t.co/BLwOeTRm5h pic.twitter.com/BAlOGIn4bT
">A 3-0 series win for India!
— ICC (@ICC) August 6, 2019
Rishabh Pant finishes unbeaten on 65 as India win by seven wickets. With the ball it was Deepak Chahar who impressed, taking 3/4. #WIvIND SCORECARD 👇https://t.co/BLwOeTRm5h pic.twitter.com/BAlOGIn4bTA 3-0 series win for India!
— ICC (@ICC) August 6, 2019
Rishabh Pant finishes unbeaten on 65 as India win by seven wickets. With the ball it was Deepak Chahar who impressed, taking 3/4. #WIvIND SCORECARD 👇https://t.co/BLwOeTRm5h pic.twitter.com/BAlOGIn4bT
స్వల్ప లక్ష్యఛేదనలో ఆరంభంలోనే భారత్ ధావన్(3) వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ రాహుల్ 20 పరుగులు చేసి అవుటయ్యాడు. అనంతరం.. భారత సారథి కోహ్లీ.. యువ ఆటగాడు పంత్‌తో కలిసి విజయం దిశగా తీసుకెళ్లాడు. అడపాదడపా బౌండరీలు సాధించిన వీరు అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు.
గెలుపునకు 14 పరుగుల దూరంలో విరాట్ అవుటవ్వగా.. మనీష్ పాండే(2 నాటౌట్) తో కలిసి లాంఛనాన్ని పూర్తి చేశాడు పంత్. విండీస్ బౌలర్ థామస్ 2 వికెట్లు తీశాడు.