ETV Bharat / sports

డబుల్ సెంచరీ మిస్సయిన భారత మహిళా క్రికెటర్లు వీరే!

ప్రస్తుతం పురుష క్రికెటర్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఆడుతున్నారు మహిళా క్రికెటర్లు. బ్యాట్​, బంతితో రాణిస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఇప్పటికే మహిళా క్రికెట్​లో ఇద్దరు డబుల్ సెంచరీలు సాధించగా.. భారత జట్టులో మాత్రం ఆ లోటు కనిపిస్తోంది. ఇప్పటివరకు ముగ్గురు ద్విశతకం చేసే విధంగా కనిపించినా.. దురదృష్టవశాత్తు ఆ అవకాశం చేజారింది. వారెవరో చూద్దాం.

author img

By

Published : Jul 20, 2020, 6:04 PM IST

డబుల్ సెంచరీ మిస్సయిన భారత మహిళా క్రికెటర్లు వీరే!
డబుల్ సెంచరీ మిస్సయిన భారత మహిళా క్రికెటర్లు వీరే!

మహిళల క్రికెట్​కు ఇప్పుడిప్పుడే గుర్తింపు లభిస్తోంది. వారి మ్యాచ్​ల పట్ల అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. టీమ్​ఇండియా మహిళలు కూడా తమ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. పురుష ఆటగాళ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఆడుతున్నారు. ఇప్పటికే మహిళల వన్డే క్రికెట్​లో అమెలియా కేర్ (232*), బెలిందా క్లర్క్ (229*) డబుల్ సెంచరీలు సాధించారు. అయితే భారత మహిళల జట్టులో కొందరు బ్యాట్స్​ఉమెన్ పరిమిత ఓవర్ల క్రికెట్​లో డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయారు. వారెవరో ఓసారి చూద్దాం.

స్మృతి మంధాన (135)

ఐసీసీ మహిళల ఛాంపియన్​షిప్​-2018లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్​లో స్మృతి చెలరేగి ఆడింది. టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన భారత్​కు చక్కటి శుభారంభాన్ని అందించింది మంధాన. స్లో పిచ్​పై స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తూ 129 బంతుల్లోనే 135 పరుగులు చేసి ఆకట్టుకుంది. ఫలితంగా టీమ్​ఇండియా 303 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అయితే అప్పటికి ఇంకా 7 ఓవర్లు మిగిలుండగా స్టంపౌట్​గా వెనుదిరిగింది. స్మృతి జోరు చూస్తే కచ్చితంగా డబుల్ సెంచరీ చేస్తుందని అంతా భావించారు. ఈ మ్యాచ్​లో 14 ఫోర్లు, ఒక సిక్సు బాదింది మంధాన.

స్మృ,తి
స్మృ,తి

హర్మన్ ప్రీత్ కౌర్ (171*)

ప్రస్తుతం భారత టీ20 జట్టుకు కెప్టెన్​గా ఉన్న హర్మన్ ప్రీత్​ తనదైన శైలి ప్రదర్శనతో గుర్తింపు తెచ్చుకుంది. 2017లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్​లో కౌర్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది, వర్షం కారణంగా 42 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్​లో తన బ్యాటింగ్​తో పరుగుల జడివాన కురిపించిందీ క్రికెటర్. 20 ఫోర్లు, 7 సిక్సుల సాయంతో 115 బంతుల్లోనే 171 పరుగులతో నాటౌట్​గా నిలిచింది. ఫలితంగా ఇండియా 281 పరుగుల భారీ స్కోర్ సాధించింది. మ్యాచ్ మొత్తం ఓవర్లు సాగితే కౌర్ డబుల్ సెంచరీ సాధించేది.

హర్మన్ ప్రీత్
హర్మన్ ప్రీత్

దీప్తి శర్మ (188)

టీమ్​ఇండియా మరో మహిళా క్రికెటర్ దీప్తి శర్మ డబుల్ సెంచరీకి దగ్గరగా వచ్చి ఔటైంది. 2017లో దక్షిణాఫ్రికా, జింబాబ్వే, ఐర్లాండ్​తో జరిగిన సిరీస్​లో భారత్ విజేతగా నిలిచింది. ఆతిథ్య సౌతాఫ్రికా, భారత్​ సమాన పాయింట్లతో ఉండటం వల్ల రన్​రేట్ మెరుగ్గా ఉన్న కారణంగా ఇండియాను విజేతగా ప్రకటించారు. అయితే ఆ రన్​రేట్ మెరుగ్గా ఉండటానికి కారణం ఐర్లాండ్​తో జరిగిన మ్యాచ్​లో భారత్ 249 పరుగుల భారీ తేడాతో గెలవడమే.. ఈ మ్యాచ్​లో దీప్తి శర్మ 160 బంతుల్లో 188 పరుగులతో సత్తాచాటింది. ఇందులో 27 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. కానీ దురదృష్టవశాత్తు 46వ ఓవర్​లో దీప్తి ఔటైంది. ఒకవేళ ద్విశతకం సాధిస్తే మహిళల క్రికెట్​లో ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్​గా నిలిచేది దీప్తి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.