ETV Bharat / sports

రెండో టెస్టు: భారత బౌలర్లు భళా.. కివీస్‌ తొలి ఇన్నింగ్స్​​ 235 - రెండో టెస్టు: కివీస్‌ తొలి ఇన్నింగ్​లో 235 ఆలౌట్​

భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్​ 73.1 ఓవర్లకు 235 పరుగులు చేసి ఆలౌట్​ అయింది. అంతకుముందు 63/0తో రెండో రోజు ఆట ప్రారంభించిన కివీస్​ను.. భారత బౌలర్లు బాగానే కట్టడిచేశారు. షమి 4, బుమ్రా 3, జడేజా రెండు వికెట్లతో సత్తా చాటారు.

New Zealand vs India, 2nd Test
రెండో టెస్టు: కివీస్‌ తొలి ఇన్నింగ్​లో 235 ఆలౌట్​
author img

By

Published : Mar 1, 2020, 8:48 AM IST

Updated : Mar 3, 2020, 12:58 AM IST

క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్​ ఆధిపత్యం ప్రదర్శించింది. టీమిండియా బౌలర్ల ధాటికి 73.1 ఓవర్లకు ఆ జట్టు 235 పరుగులు చేసి ఆలౌట్​ అయింది. కివీస్​ బ్యాటింగ్​లో టామ్​ లాథమ్​(52), జేమిసన్​(49) రాణించారు. ప్రస్తుతం భారత్​ 7 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.

లాథమ్​ ఒక్కడే..

అంతకుముందు 63/0తో రెండో రోజు ఆట ప్రారంభించిన కివీస్‌కు.. ఆదిలోనే షాకిచ్చాడు ఉమేశ్‌ యాదవ్‌. 25.3 ఓవర్‌లో టామ్‌ బ్లండెల్‌ 30(77 బంతుల్లో 4ఫోర్లు)ను ఎల్బీగా పెవిలియన్‌ పంపాడు. మరో మూడు పరుగుల వ్యవధిలో కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌(3)ను బుమ్రా బోల్తా కొట్టించాడు. కీపర్‌కు క్యాచ్‌ ఇవ్వడం వల్ల విలియమ్సన్‌ తక్కువ స్కోరుకే పరిమితమయ్యాడు. తర్వాత రాస్‌టేలర్‌(15)తో కలిసి టామ్‌ లాథమ్‌ 52(122 బంతుల్లో 5ఫోర్లు) ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఇద్దరూ 40 పరుగుల భాగస్వామ్యం జోడించాక జడేజా చక్కటి బంతితో టేలర్‌ను ఔట్‌ చేశాడు. కాసేపటికే లాథమ్‌(52) అర్ధశతకం పూర్తి చేసుకున్నాక షమి బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. హెన్రీ నికోల్స్‌(14) షమి బౌలింగ్‌లోనే కోహ్లీకి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు.

బుమ్రా ఫామ్​లోకొచ్చాడు..

భోజన విరామానికి కివీస్‌ 48 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. వాట్లింగ్‌(0), గ్రాండ్‌హోమ్‌(8) అప్పటికి క్రీజులో ఉన్నారు. మ్యాచ్‌ తిరిగి ప్రారంభమయ్యాక బుమ్రా మాయ చేశాడు. ఒకే ఓవర్‌లో వాట్లింగ్‌ను, టిమ్‌సౌథీ(0)ని ఔట్‌ చేశాడు. ఫలితంగా కివీస్‌ 53 ఓవర్లకు 153/7తో నిలిచింది. ఆఖర్లో జేమిసన్​(49), వాగ్నర్​(21) వేగంగా పరుగులు రాబట్టడం వల్ల.. 235 వరకు కివీస్​ రాగలిగింది.

భారత బౌలర్లలో మహ్మద్‌ షమి(4), జస్ప్రీత్‌ బుమ్రా(3), జడేజా(2)వికెట్లు తీయగా.. ఉమేశ్‌ ఒక వికెట్‌ పడగొట్టాడు. తొలుత టాస్​ ఓడి బ్యాటింగ్​ చేసిన భారత్.. మొదటి ఇన్నింగ్స్​లో​ 242 పరుగులకు ఆలౌట్​ అయింది. పృథ్వీ షా(54), పుజారా(54), విహారి(55) అర్ధశతకాలతో రాణించారు. న్యూజిలాండ్​ బౌలర్లలో జేమిసన్​(5/45)తో భారత్​ను గట్టి దెబ్బ తీశాడు.

Last Updated : Mar 3, 2020, 12:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.