ETV Bharat / sports

ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజానికి కరోనా - లండన్ స్పిరిట్

ఇంగ్లాండ్​లో జరుగుతున్న 'ది హండ్రెడ్​ లీగ్'​లో.. లండన్​ స్పిరిట్​కు కోచ్​గా ఉన్న ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్​ షేన్​ వార్న్​కు కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన స్వీయ నిర్బంధంలో ఉన్నట్టు జట్టు ప్రకటన విడుదల చేసింది.

Shane Warne
కరోనా
author img

By

Published : Aug 2, 2021, 8:03 AM IST

ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్​ షేన్​ వార్న్​కు కరోనా సోకింది. ప్రస్తుతం ఇంగ్లాండ్​లో ఉన్న వార్న్​.. ఐసోలేషన్​లోకి వెళ్లాడు.

ఇంగ్లాండ్​లో ప్రస్తుతం 'ది హండ్రెడ్'​ లీగ్​ జరుగుతోంది. అందులో లండన్​ స్పిరిట్​ జట్టుకు ప్రధాన కోచ్​గా వార్న్​ వ్యవహరిస్తున్నాడు. పరీక్షల్లో పాజిటివ్​గా తేలిన క్రమంలో సథర్న్​ బ్రేవ్​తో జరిగిన పోరుకు దూరమయ్యాడు.

"కొంత అలసటగా అనిపించి వార్న్​ టెస్ట్​ చేయించుకున్నాడు. పరీక్షలో పాజిటివ్​గా తేలింది. జట్టు నుంచి ఐసొలేట్​ అయ్యాడు. జట్టు మేనేజ్​మెంట్​ బృందంలో ఓ సభ్యుడికి కూడా కరోనా సోకింది. ఆయన కూడా స్వీయ నిర్బంధంలో ఉన్నారు. వార్న్​తో సన్నిహితంగా ఉన్న జట్టు సిబ్బందిలో ఒకరు పరీక్ష చేయించున్నారు. ఫలితాలు రావాల్సి ఉంది. కాగా జట్టు ఆటగాళ్లపై ఈ ప్రభావం లేదు."
- లండన్​ స్పిరిట్​ ప్రకటన

లండన్​ స్పిరిట్​తో జరిగిన పోరులో నాలుగు పరుగుల తేడాతో సథర్న్​ బ్రేవ్​ గెలిచింది.

ఇదీ చూడండి: ఇంగ్లాండ్​తో టెస్టు​ సిరీస్​.. రికార్డులపై కోహ్లీ, రోహిత్ గురి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.