ఏడాది పాటుగా క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) తాత్కాలిక కార్యనిర్వాహక అధ్యక్షుడిగా(సీఈఓ) వ్యవహరిస్తున్న నిక్ హోక్లేను శాశ్వత సీఈఓగా నియమించింది ఆసీస్ క్రికెట్ బోర్డు. కరోనా సమయంలో అంతర్జాతీయ, దేశవాళీ మ్యాచ్లను విజయవంతంగా జరపడం సహా విధులను సమర్థవంతంగా నిర్వహించారు నిక్. ఈ నేపథ్యంలోనే ఆయనకు ఈ బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది బోర్డు. తనకు సీఈఓగా పూర్తి స్థాయిలో బాధ్యతలు అప్పగించడంపై నిక్ హర్షం వ్యక్తం చేశారు.
హోక్లేకు.. 2020 ఐసీసీ టీ20 ప్రపంచకప్ సీఈఓగా, 2015 ప్రపంచకప్ మార్కెటింగ్, కమర్షియల్ వ్యవహార బాధ్యతలు చేపట్టిన అనుభవం ఉంది.
ఇదీ చూడండి: 'మా వాళ్లను క్షేమంగా పంపారు.. థ్యాంక్యూ బీసీసీఐ'