ETV Bharat / sports

కరోనా ఎఫెక్ట్​: టీ20 ప్రపంచకప్​ క్వాలిఫయర్స్​ రద్దు

ఆస్ట్రేలియా వేదికగా 2022లో జరిగే టీ20 ప్రపంచకప్​ అర్హత టోర్నీలైనా.. యూరప్ క్వాలిఫయర్స్​ రద్దయ్యాయి. కొవిడ్ కారణంగా ఆ టోర్నీలను రద్దు చేస్తున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ప్రకటించింది.

author img

By

Published : May 7, 2021, 3:05 PM IST

icc,  Three ICC Men's T20 WC 2022 European qualifiers cancelled
ఐసీసీ, టీ20 ప్రపంచ కప్​ యూరప్ క్వాలిఫయర్స్​ టోర్నీలు రద్దు

ఐసీసీ టీ20 ప్రపంచకప్​ అర్హత టోర్నీలైన సబ్ రీజినల్​ యూరప్​ క్వాలిఫయర్​ టోర్నీలు.. కొవిడ్ కారణంగా రద్దయ్యాయి. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) అధికారికంగా ప్రకటించింది. 2022లో ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్​లో పాల్గొనే చివరి రెండు జట్లను ఈ టోర్నీ ద్వారా నిర్ణయిస్తారు.

ఈ ప్రపంచకప్​ సబ్​ రీజినల్ యూరప్​.. ఏ, బీ క్వాలిఫయర్స్​ మ్యాచ్​ల కోసం ఫిన్లాండ్ ఆతిథ్యమివ్వనుంది. వీటిలో యూరప్​ క్వాలిఫయర్స్​-బీ మ్యాచ్​లు జూన్​ 30 నుంచి జులై 5 మధ్య జరగనున్నాయి. క్వాలిఫయర్స్సీ- మ్యాచ్​లు జులై 5-10 వరకు తలపెట్టినారు. క్వాలిఫయర్స్​-ఏ మ్యాచ్​లు జులై 13 వరకు నిర్వహించాల్సింది.

కొవిడ్ కేసుల నేపథ్యంలో ఈ మూడు క్వాలిఫయర్స్​ను రద్దు చేయాలని ఐసీసీ నిర్ణయం తీసుకుంది. వీటితో పాటు టీ20 ప్రపంచకప్​ అమెరికా క్వాలిఫయర్స్​, ఆసియా క్వాలిఫయర్స్​ టోర్నీలూ వాయిదా పడ్డాయి.

ఇదీ చదవండి: నాదల్, ఒసాకాను వరించిన ప్రతిష్ఠాత్మక లారస్​ అవార్డు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.