కరోనాపై అవగాహన కల్పించడంలో ఎప్పుడూ ముందుంటాడు టీమ్ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. మహమ్మారికి సంబంధించి మరోసారి ట్విట్టర్ వేదికగా అభిమానులకు పలు సూచనలు చేశాడు. బట్టతో తయారు చేసిన మాస్క్‌లు కాకుండా ఎన్95 మాస్క్‌లను వాడాలని కోరాడు. వీలైనంత త్వరగా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించాడు.
"కొవిడ్ నుంచి సురక్షితంగా ఉండటానికి వీలైనంత త్వరగా టీకా తీసుకోండి. బట్టతో తయారు చేసిన మాస్క్ కాకుండా.. దయచేసి ప్రతి ఒక్కరూ రెండు మాస్క్‌లు ధరించండి" అని ట్వీట్ చేశాడు అశ్విన్.
ఇదీ చదవండి: రోడ్రిగేజ్పై గెలవడమే లక్ష్యం: వాటర్సన్
దీనికి స్పందించిన ఓ ట్విట్టర్ యూజర్.. తనకు రెండో డోస్ టీకా ఇంకా వేయలేదని తెలిపాడు. ప్రతిస్పందించిన అశ్విన్.. మనది అతి ఎక్కువ జనాభా గల దేశం. దయచేసి మీ వంతు వచ్చే వరకు జాగ్రత్తగా వేచి ఉండండని సూచించాడు.
-
N 95 masks can be washed and reused. I am happy to buy and give it to people who can’t afford it! Please let me know ways to distribute them if you or anyone on my timeline knows how🙏 https://t.co/iGjTmVDXqs
— MASK UP INDIA ( NO CLOTH MASKS PLS)🙏🙏🇮🇳 (@ashwinravi99) May 7, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">N 95 masks can be washed and reused. I am happy to buy and give it to people who can’t afford it! Please let me know ways to distribute them if you or anyone on my timeline knows how🙏 https://t.co/iGjTmVDXqs
— MASK UP INDIA ( NO CLOTH MASKS PLS)🙏🙏🇮🇳 (@ashwinravi99) May 7, 2021N 95 masks can be washed and reused. I am happy to buy and give it to people who can’t afford it! Please let me know ways to distribute them if you or anyone on my timeline knows how🙏 https://t.co/iGjTmVDXqs
— MASK UP INDIA ( NO CLOTH MASKS PLS)🙏🙏🇮🇳 (@ashwinravi99) May 7, 2021
మరోక వ్యక్తి.. ఎన్95 మాస్క్‌లు ఖరీదైనవి. వాటిని మేము వాడలేమని పేర్కొన్నాడు. "వాటిని శుభ్రం చేసి మళ్లీ వాడవచ్చు. వాటిని కొనలేని వారికి నేను ఇవ్వగలను. అవి ప్రజలకు ఎలా చేరాలన్నది నాకు సూచించండి చాలు" అని అశ్విన్ పేర్కొన్నాడు.
ఇదీ చదవండి: నాదల్, ఒసాకాను వరించిన ప్రతిష్ఠాత్మక లారస్ అవార్డు